బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్! కొత్త 2025 బజాజ్ పల్సర్ NS160 వచ్చేసింది

భారతదేశంలోని ప్రముఖ ఆటో కంపెనీలలో ఒకటైన బజాజ్(Bajaj) దేశీయంగా మంచి మార్కెట్ కలిగి ఉంది. ముఖ్యంగా ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ బైక్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బజాజ్ బ్రాండ్ పేరు తెలియని వారు ఉండవచ్చు, కానీ పల్సర్ బైక్ గురించి తెలియని బైక్ గురించి తెలియని వారు ఉండరు. దీనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. స్పోర్టీ లుక్స్, పవర్‌ఫుల్ ఇంజిన్, ఆకట్టుకునే డిజైన్, బలమైన బాడీ నిర్మాణంతో ప్రధానంగా యువతలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉండటం కారణంగా పల్సర్‌‌ను టూవీలర్ విభాగంలో ఓ ట్రెండ్‌సెటర్‌గా నిలిచేలా చేశాయి. దీంతో తన కస్టమర్లకు నమ్మకాన్ని పోగోట్టుకోకుండా ఉండటానికి కంపెనీ ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ చేసిన కొత్త పల్సర్ బైక్‌లను లాంచ్ చేస్తూనే ఉంది.


ప్రస్తుతం బజాజ్ పల్సర్ సిరీస్ 125cc నుండి 400cc వరకు విభిన్న ఇంజిన్ కెపాసిటీతో అందుబాటులో ఉంది. ప్రతి రైడర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, బజాజ్ తన బైక్‌లలో కోత్త ప్రత్యేకతలను అందిస్తుంది. కంపెనీ ఇప్పటికే అమ్మకానికి ఉన్న పల్సర్ బైక్‌లను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తూనే మరోవైపు కొత్త మోడళ్లను కూడా తీసుకువస్తుంది. తాజాగా కంపెనీ కొత్తగా అప్‌డేట్‌ చేసిన 2025 పల్సర్ NS160 బైక్‌ను లాంచ్ చేసింది.

బజాజ్ పల్సర్ సిరీస్‌లో ఎల్లప్పుడూ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన NS160 మోడల్‌కి 2025లో 3 స్మార్ట్ రైడింగ్ మోడ్‌లు రోడ్, రెయిన్, ఆఫ్-రోడ్ ఉన్నాయి. దీని ప్రకారం, ఇది సాధారణ రోడ్లపై అలాగే, వర్షంలో ఇంకా ఆఫ్‌రోడ్‌లో కూడా ఈజీగా ప్రయాణిస్తుందని తెలుస్తుంది. రైడర్‌లకు వేర్వేరు రోడ్ కండిషన్‌లకు అనుగుణంగా బైక్ పనితీరును సర్దుబాటు చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది. రోడ్ మోడ్ సాధారణ పట్టణ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.

రెయిన్ మోడ్‌ను వాడినట్లయితే వర్షంలో టైర్ గ్రిప్‌ను మరింత మెరుగుపరిచి బైక్‌ను స్కిడ్ కాకుండా రైడ్ చేయవవచ్చు. చివరగా మట్టి, గుంతలు, ఇసుక తలాల్లో, ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లో రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని ఆఫ్‌రోడ్ అందిస్తుంది. కొత్తగా అందించిన 3 రైడింగ్ మోడ్స్ కూడా పల్సర్ NS160 ABS (యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) పనితీరును స్మార్ట్‌గా అనుకూలం చేస్తాయి, ఇది ప్రతి రోడ్ కండిషన్‌కు అనుగుణంగా భద్రతను పెంచుతుంది.

రోడ్ మోడ్‌లో ABS సాధారణ బ్రేకింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రైడింగ్ మోడ్, ఆఫ్-రోడ్ మోడ్‌లో, వెనుక వీల్ ABS పనితీరు కొంచెం తక్కువగా ఉంటుంది. బైక్‌ను కఠినమైన, ఎగుడుదిగుడు లేదా బురదతో కూడిన రూట్లలో నడిపినప్పుడు అదనంగా కంట్రోలింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. మీరు ఏ రోడ్‌లో ప్రయాణించినా, పల్సర్ NS160 మీకు సరైన మోడ్‌తో సిద్ధంగా ఉంటుంది. ప్రధాన ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి.

ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే కొత్త ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు రూట్ కోసం టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీని తెలుసుకోవడం కోసం రియల్-టైమ్ పెట్రోల్ ఇండికేటర్, స్మూత్ గేర్ షిఫ్టింగ్‌ కోసం గేర్ పొజిషన్ ఇండికేటర్, స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అయ్యే బ్లూటూత్ సపోర్ట్, రన్నింగ్‌లో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి USB మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి.