రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని వంద శాతం ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేశారు..
జులై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్ పుట్ సబ్సీడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని ఆదేశించిన సీఎం… దీంతో సంబంధిత రైతులకు గుడ్ న్యూస్ చెప్పినట్టు అయ్యింది.. ఇక, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని క్లారిటీ ఇచ్చారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 140 డ్రోన్లు మాత్రమే వినియోగిస్తున్నామని వెల్లడించారు అధికారులు. ఇక, కరవు ప్రాంతాల్లో మాయిశ్చర్ ను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పరిశీలన చేసి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెరిగేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు.
ఇక, మైక్రో ఇరిగేషన్ మాన్యుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. నిమ్మ, టమాటా, మామిడి వంటి ఉత్పత్తుల విలువ జోడించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలన్న సీఎం. ఈ ఉత్పత్తుల ఎగుమతులకు ఎయిర్ కార్గో సేవల్ని అందించేలానూ చూడాలని స్పష్టం చేశారు.. త్వరలోనే ప్రారంభించనున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలుపై కొన్ని సూచనలు చేశారు.. లబ్ధిదారులను గుర్తించేందుకు మొబైల్ నెంబర్లు- బ్యాంకు ఖాతాలను అనుసంధానానికి ఆదేశించారు.. ఈ మేరకు జియో ట్యాగ్ చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.