నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏలూరు ఇండియన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందించేందుకు ఏజెంట్లని ఎంపిక చేయనున్నారు.
ఈమేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏలూరు పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ శ్రీకర్ బాబు అధికారిక ప్రకటన చేశారు. అర్హత, ఆసక్తి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి పాలసీదారులను చేర్పించిన ఏజెంట్ లకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి పాలసీదారుడు చెల్లించే డబ్బుల ఆధారంగా కమిషన్ పద్ధతిలో జీతాలు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ కి ఎలాంటి టార్గెట్స్ వంటివి ఉండవని, వీలున్న సమయంలో మాత్రమే ఏజెంట్లుగా విధులు నిర్వహించవచ్చని సూచించారు.
వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్లపైన ఉండాలి.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
కావలసిన ధ్రువపత్రాలు: టెన్త్ ఒరిజినల్ విద్యార్హత పత్రాలు, పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ, వివరాలు: ఏలూరు జిల్లా ఏలూరు పోస్టల్ డివిజన్ ఆఫీస్ కార్యాలయంలో ఈ నెల 7, 8 తారీకులలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.