నిరుద్యోగులకు శుభవార్త.. 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు చక్కటి అవకాశం వచ్చింది. APSSDC (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా కర్నూలులో జూన్ 13, 2025 (శుక్రవారం) న ఉదయం 10:00 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.


అర్హులు ఎవరు.?

పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారు. ఇంటర్, డిగ్రీ లేదా ఇతర హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన నిరుద్యోగులు కూడా అర్హులే. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు

ఎక్కడ జరుగుతుంది?

ఈ మినీ జాబ్ మేళా కర్నూలు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జరుగుతుంది. నియోజకవర్గాల వారీగా విస్తృతంగా జరిగే ఈ మేళాలో జిల్లాలోని నిరుద్యోగులు పాల్గొనవచ్చు. ఈ జాబ్ మేళాలో వొడాఫోన్ ఐడియా, ముథూట్ ఫైనాన్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ రోల్స్‌ ఆధారంగా రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు జీతం అందిస్తారు.

కావాల్సిన డాక్యూమెంట్స్‌

రెజ్యూమ్, విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు,

ఫార్మల్ డ్రెస్సింగ్ తప్పనిసరి. జాబ్ మేళాలో పాల్గొనడానికి www.ncs.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.