సర్కారు బంపర్ ఆఫర్.. మూడో బిడ్డను కంటే 12 లక్షలు

దవడానికి కూడా ఆశ్చర్యంగా ఉన్న కూడా ఇది నిజం. పుట్టే పిల్లల సంఖ్య తక్కువవుతూ, వృద్ధుల సంఖ్య ఎక్కువవుతోన్న తరుణంలో డ్రాగన్ కంట్రీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.


తీవ్రమైన జనాభా సంక్షోభానికి చెక్ పెట్టేందుకు నగదు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన చైనా.. జనాభా సంక్షోభానికి చరమగీతం పాడుతూ భవిష్యత్తును మెరుగ్గా మార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం అసాధారణంగా పెద్ద ఎత్తున నగదు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టడం మొదలుపెట్టింది. జననాల రేటు పెంచేందుకు ఇప్పటికే అనేక నగరాల్లో కాసుల వర్షం కురిపించడం ప్రారంభించింది. పిల్లల్ని కనేవారికి నేరుగా లక్షల్లో నగదు బహుమతులు, ఉచిత సేవలు, భవిష్యత్‌కు భరోసా కలిగించే పథకాలను ప్రకటిస్తోంది.

లక్షల్లో నగదు బహుమతులు..

ఇన్నర్ మంగోలియాలోని హోహోట్ నగరంలో మూడో బిడ్డకు జన్మనిచ్చే జంటలకు ఏకంగా లక్ష యువాన్లు (దాదాపు రూ. 12 లక్షలు) బహుమతిగా అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని పదేళ్లపాటు విడతలుగా చెల్లిస్తారు.

మొదటి బిడ్డకు: ₹1.2 లక్షల మేర నగదు (10 వేల యువాన్లు)

రెండో బిడ్డకు: ₹6 లక్షల మేర (50 వేల యువాన్లు)

మూడో బిడ్డకు: ₹12 లక్షల నగదు సహాయం

వాటితో పాటు ఉచిత వైద్య పరీక్షలు, ఒక సంవత్సరం పాటు ఉచిత పాల సరఫరా, మరియు పిల్లల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. అంతే కాకుండా ఇల్లు కొనే వారికి ప్రత్యేక రాయితీలు వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తున్నారు. టియాన్మెన్ నగరంలో అయితే, రెండో లేదా మూడో బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు నెలనెలా భత్యం కూడా అందిస్తున్నారు. పిల్లలు మూడేళ్లు వచ్చే వరకు ఈ సాయం అందుతుంది.

గతంలో చైనా “ఒకే బిడ్డ” పాలసీని దాదాపు మూడు దశాబ్దాలు పాటించింది. కానీ 2016లో ఆ పాలసీని ఎత్తేసినప్పటికీ, జననాల రేటు పెరగలేదు. 2016లో 1.8 కోట్ల జననాలు నమోదవగా, 2023 నాటికి అది కేవలం 95 లక్షలకు పడిపోయింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా 80 కోట్లకు తగ్గే అవకాశం ఉంది. దాంతో భవిష్యత్తులో కార్మికుల కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం “పిల్లలే సంపద” అనే కాన్సెప్ట్‌తో ముందుకు వస్తోంది. మరి చైనా అవలంబిస్తున్న ఈ ఆర్థిక ప్రోత్సాహకాల మార్గం ఎంత మేరకు విజయవంతమవుతుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.