ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. హెల్త్ అండ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎంఎస్ఆర్‌బీ) పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం కొడితే.. రూ.లక్షకు పైగా వేతనం వస్తోంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, వయస్సు, ఉద్యోగ ఎంపిక విధానం గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య & కుంటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా పలు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 27వ తేదీ ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వొచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 53
ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కన్సలెంట్ బయోకెమిస్ట్, కన్సలెంట్ మైక్రో బయాలజిస్ట్, పీడియాట్రీషియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – ఖాళీలు
కన్సల్టెంట్ బయోకెమిస్ట్: 1
కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్: 1
పీడియాట్రీషియన్ : 51 ఉద్యోగాలు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డిప్లొమా, ఎండీ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 42 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగం కొట్టిన వారికి భారీ వేతనం కల్పిస్తారు. నెలకు రూ.1,10,000 జీతం అందిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 2025 మే 27
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://apmsrb.ap.gov.in
వేదిక: ఆఫీస్ ఆఫ్ ది ఎపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, మూడో అంతస్తు, ఫైకేర్ బిల్డింగ్, ఆటోనగర్, మంగళగిరి, గుంటూరు జిల్లాలో ఇంటర్వ్యూ ఉంటుంది.
అర్హత ఉన్న వారు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.లక్షకు పైనే జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 53
ఇంటర్వ్యూ తేది: 2025 మే 27