ఈ స్కీమ్ కింద రూ.30 వేలు.. 18 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్

యువతీ యువకుల వయసు 18 నుండి 35 సంవత్సరాలు మధ్యన ఉండాలి. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు చెందిన గ్రామీణ యువతీ యువకులైన సరే ఈ శిక్షణా కార్యక్రమానికి పాల్గొనవచ్చు.


శ్రీకాకుళం జిల్లా పాలకొండలో గ్రామీణ యువతకు ఉచిత వసతి, శిక్షణ, ఉద్యోగ అవకాశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, వసతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీలో ఉచిత శిక్షణా కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని DDU GKY అధికారులు తెలియజేశారు.

టూరిజం అండ్ హాస్పిటల్ శిక్షణలో భాగంగా ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీసెస్ అసోసియేట్, రెస్టారెంట్ కెప్టెన్, ఎమ్మెస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్ ని ఈ 90 రోజుల శిక్షణా కార్యక్రమంలో నేర్పించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమానికి పాల్గొనాలనుకున్న విద్యార్థిని విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ పాస్ ఆర్ ఫెయిల్ అయిన అభ్యర్థులు ఎవరైనా అర్హులు.

ఈ శిక్షణా కార్యక్రమంలో చేరాలి అనుకున్నవారు ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే 10th, ఇంటర్ లేదా ఐటిఐ మార్క్ లిస్ట్ జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఆరు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్, ఈ శిక్షణలో పాల్గొన్న గ్రామీణ యువతులు ఎవరైనా ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజులు పని దినాలు పూర్తి చేసిన అనంతరం వారు గాని ఈ శిక్షణలో పాల్గొంటే శిక్షణానంతరం వారికి 25 వేల నుంచి 30 వేల వరకు స్టైఫండ్ లభించును.

దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం క్రింద శిక్షణ ఇవ్వడం వలన ఈ 90 రోజులు కాల పరిమితిలో ఉచిత వసతి సౌకర్యం అలాగే ఉచిత యూనిఫాం, ట్రైనింగ్ కిట్, కంప్యూటర్ ట్రైనింగ్, డేటా ఎంట్రీ , టైపింగ్ స్కిల్స్, ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చిన అనంతరం కేంద్ర ప్రభుత్వం (NCVT CERTIFICATE) వారి ధ్రువపత్రం ఇస్తారు.

ఈ శిక్షణలో పాల్గొన్న యువతీ యువకుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు మధ్యన ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాకు చెందిన గ్రామీణ యువతి యువకులైన సరే ఈ శిక్షణా కార్యక్రమానికి పాల్గొనవచ్చు.

ఈ ఉచిత శిక్షణ శిబిరం చిరునామా కచ్చితంగా తెలుసుకోవాల్సిందే: లక్ష్మీ దీప మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, సింగన్న వలస, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా. ఈ శిక్షణకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా ఈ క్రింది నెంబర్లకు సంప్రదించవచ్చు: 9989250493, 8341629551, 9705201214.