ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. వారానికి 5 రోజులే పని..

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై వారానికి 5 రోజులే పని దినాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పారు.


ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు వారానికి 5 రోజులు మాత్రమే ప్రస్తుతం పనివేళలులున్నాయి. ఇవి మరో యేడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియల్ ఎంప్లాయిస్ తో పాటు, వివిధ శాఖాధిపతుల, కార్పోరేషన్ విభాగాల అధిపతులు వారి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి కేవలం 5 రోజులు డ్యూటీ చేయాలన్న నిబంధన ఉంది.

సచివాలయ ఉద్యోగులు, డిపార్ట్మెంట్ హెడ్ లు, కార్పొరేషన్ విభాగ అధిపతులు.. వారానికి 5 రోజులు డ్యూటీ చేయాలన్న నిబంధన ఉత్తర్వుల గడువు ఈ నెనల 26తో ముగయనుంది.

తాజాగా ఈ గడువు మరో ఇయర్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వచ్చే యేడాది  27 జూన్ 2026 వరకు వారానికి ఐదు రోజులు దినాలు.. రెండు రోజుల సెలవు దినాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ విజయానంద్.

అయితే సెక్రటేరియట్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా పోలీస్, హాస్పిటల్, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ పనిచేసే వారికి కూడా ఈ నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమర్జన్సీ  సర్వీసుల్లో పనిచేసేవారికి వారంలో ఏదైనా రెండు రోజులు సెలవులు ఇచ్చేలా చూడాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.