HCL Jbobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

www.mannamweb.com


హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆసక్తిక, అర్హత ఉన్న అభ్యర్థులను ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021 / 2022 / 2023 సంవత్సరాల్లో గేట్ పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. అలాగే 2021 / 2022 / 2023 చెల్లుబాటు అయ్యే గేట్ స్కోరు కలిగి ఉండాలి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనీస వయసు 28 ఏళ్లుగా ఉండాలి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జనవరి 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దదరఖాస్తు స్వీకరణకు ఫిబ్రవరి 19వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఇక దరఖాస్తు ఫీజు విషయానికొస్తే.. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు మినహాయించారు.

ఈ పోస్టులను రెండు దశల్లో ఎంపిక చేస్తారు. వీటిలో మొదటిది గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్ట్ లకు గేట్ స్కోర్ కాగా, పర్సనల్ ఇంటర్వ్యూ రెండోది. గేట్‌ స్కోర్‌కు 70 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటాయి.