అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిస్తొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ వివరాలు ఇలా.
నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం మొత్తం, కేరళ, మాహే, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడులోని అనేక ప్రాంతాలు, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు.. మిజోరంలోని కొన్ని ప్రాంతాలకు ఈరోజు, 24 మే 2025న విస్తరించాయి. ఈ విధంగా, నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ సాధారణ తేదీకి బదులుగా, నేడు, 24 మే, 2025న కేరళను తాకాయి.
రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 13°ఉత్తర అక్షాంశం / 55°తూర్పురేఖాంశం , 13°ఉత్తర అక్షాంశం / 60°తూర్పురేఖాంశం,13.5°ఉత్తర అక్షాంశం / 60°తూర్పురేఖాంశం, 13.5°ఉత్తర అక్షాంశం / 65°తూర్పురేఖాంశం, 15°ఉత్తర అక్షాంశం /70°తూర్పురేఖాంశం. కార్వార్ ,షిమోగా ,ధర్మపురి ,చెన్నై 15°ఉత్తర అక్షాంశం / 83 °తూర్పురేఖాంశం,18°ఉత్తర అక్షాంశం / 87 °తూర్పురేఖాంశం , 25°ఉత్తర అక్షాంశం / 96°తూర్పురేఖాంశం, 27°ఉత్తర అక్షాంశం / 98°తూర్పురేఖాంశం వరకు కొనసాగుతున్నది.
రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మొత్తం గోవా, మహారాష్ట్ర & ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలలోని మరికొన్ని ప్రాంతాలు.. ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మే 27వ తేదీనాటికి పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో అల్పపీడనము ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.