Hero Xtreme 125R Launch : ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ జనవరి 23న (మంగళవారం) హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ కొత్త బైకును భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
ఈ కొత్త హీరో బైక్ రూ. 95వేల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కొత్త ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ కంపెనీ 125సీసీ పోర్ట్‌ఫోలియోను బలపరుస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ జాబితాలో గ్లామర్, సూపర్ స్ప్లెండర్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టీఈసీ కూడా ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ మోడల్ కూడా వచ్చి చేరింది. ఈ బైకు సంబంధించిన స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
గంటకు 60కి.మీ వేగం.. 66కి.మీ మైలేజీ :
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైకులో ఈబీటీ (ఇంజిన్ బ్యాలెన్సర్ టెక్నాలజీ)తో కూడిన కొత్త 125సీసీ స్ప్రింట్ మోటార్ (స్మూత్ పవర్ రెస్పాన్స్, ఇన్‌స్టంట్ టార్క్) ఉంది. ఇంజిన్ 11.4బీహెచ్‌పీని అందిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ యాక్సిలరేషన్ టైమ్ 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60కిలోమీటర్ల వేగాన్ని అందుకోలగలదు. అంతేకాదు.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ లీటరుకు 66 కిలోమీటర్లు మైలేజ్ అందిస్తుంది.
Hero Xtreme 125R price
కొత్త హీరో బైకు స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్ తేలికైన, భారీ-డ్యూటీ డైమండ్-టైప్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుకవైపు ఏడు-దశల సర్దుబాటు మోనోషాక్‌ను కలిగి ఉంది. ఈ కొత్త బైకులో శాలమైన 120/80 సెక్షన్ బ్యాక్ టైర్‌తో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 276ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్‌తో సెగ్మెంట్-ఫస్ట్ సింగిల్-ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ముఖ్యమైన ఫీచర్లలో సెగ్మెంట్-ఫస్ట్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ వింకర్‌లు, టైలాంప్, కాంపాక్ట్ మఫ్లర్, సెగ్మెంట్-ఫస్ట్ వీల్ కవర్ ఉన్నాయి.
ధరల వివరాలు ఇవే :
మోటార్‌సైకిల్‌కి గేర్ పొజిషన్ ఇండికేటర్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన నెగటివ్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లభిస్తుంది. హాజర్డ్ ల్యాంప్ కూడా ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌లో ఫైర్‌స్టార్మ్ రెడ్, కోబాల్ట్ బ్లూ, స్టాలియన్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. వేరియంట్ వారీగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ధర (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఐబీఎస్ – రూ. 95,000
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఏబీఎస్ – రూ. 99,500