Education : హైస్కూల్‌ ప్లస్‌లపై త్వరలో నిర్ణయం

హైస్కూల్‌ ప్లస్‌ల కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి.విజయరామరాజు తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. హైస్కూల్‌ క్రీడలు కాకుండా ఇతరత్రా ఆటలు, కార్యక్రమాల నిర్వహణకు వారిని బయటికి పంపొద్దని ఆదేశించారు. మిగులు టీచర్లు, భాషా పండితుల పదోన్నతులపైనా సమావేశంలో చర్చించారు.