గృహ రుణం తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే

మన దేశంలో చాలా మంది లోన్స్‌పై ఆధారపడి తమ సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు. అయితే హోమ్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి?


ఇప్పుడు తెలుసుకుందాం..

రుణం తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు ఆ రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత వారి కో – అప్లికెంట్‌ (లేదా) వారుసులపై ఉంటుంది. చట్ట పరంగా అయితే మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులు, బాధత్యలను వారు వారసత్వంగా పొందుతారు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి సంబంధించిన బకాయిలు, రుణ మొత్తాలను కూడా వారే చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే రుణం ఇచ్చిన బ్యాంకులకు గృహాన్ని వేలం వేసే హక్కు లభిస్తుంది. ఈ ప్రక్రియ వారసులకు ఆర్థికంగా భారాన్ని కలిగిస్తుంది.

ఇలా జరగకుండా ఉండాలంటే?

బ్యాంకులు ఇలా ఆస్తిని/ గృహాన్ని వేలానికి పెట్టకూడదనుకుంటే.. హోమ్‌ లోన్‌ తీసుకునే సమయంలోనే ఇన్సూరెన్స్‌ పాలసీని కూడా ఎంచుకోవాలి. అలా చేస్తే పాలసీ తీసుకున్న లోన్‌ మొత్తానికి సెక్యూరిటీ లభిస్తుంది. దీని వల్ల అనుకోని పరిస్థితుల్లో రుణం తీసుకున్న వ్యక్తి మరణించినా.. బకాయి లోన్‌ను ఇన్సూరెన్స్‌ పాలసీ కవర్‌ చేస్తుంది. దీని వల్ల ఆ వ్యక్తి వారసులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది.