హోండా యాక్టివాకి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అందుకే హోండా కంపెనీ యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ ను మార్కెట్ లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హోండా యాక్టివా ఈవీ గురించి లెేటెస్ట్ అప్ డేట్స్, ధర, కి.మీ. రేంజ్ తదితర వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లపై దేశవ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్న కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్స్ తీసుకువస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లకు పేరు పొందిన ఓలాకు పోటీగా అనేక కంపెనీలు తమ ఈవీలను రిలీజ్ చేస్తున్నాయి. పెట్రోల్ వేరియంట్ స్కూటర్లలో ఇండియాలో టాప్ లో ఉన్న హోండా యాక్టివా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తూ కంపెనీలకు పోటీ ఇస్తోంది. హోండా యాక్టివా ఈవీ అప్‌డేట్ ఫీచర్లు, బ్యాటరీ, ధర గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి.