Nagarjuna: ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నావ్ నాగ్

నుష్ హీరోగా నటించిన కుబేర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఆయన దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు.


కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. అలాంటిది ఆయన ధనుష్ అనే హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇలా టాప్ లీగ్‌లో సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి.

ఆది కూడా నాగ్ కి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డీ గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది. నిజానికి నాగార్జునకు ముందు నుంచి కొత్త దర్శకులను, ఇతర టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తాడనే పేరు ఉంది. ఇప్పుడు శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే, ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు.

తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు. ఒక రాకంగా ఆయన మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసాడు. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకుల నుంచే కాదు, ఆయన అభిమానుల నుంచి కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో ఒదిగిపోయాడు నాగార్జున. ముందు పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత మళ్లీ పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం. అలాంటి పాత్రలో కూడా ఆయన నటించి, కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.