AI – ML కోర్సులకు భారీ డిమాండ్ – జాబ్ పక్కా, మంచి శాలరీ

ప్రపంచం మొత్తం ఏఐ వైపు చూస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ సాంకేతికత విప్లవం కొనసాగుతోంది. ఈ ఏఐ ప్రవేశంతో ఉద్యోగాలకు ముప్పుగా మారిందనే వాదన ఉంది. ఇదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ తో పాటుగా ఎంఎల్ కోర్సుల ద్వారా భవిష్యత్ కు బంగారు బాటలు ఖాయమని టెక్ రంగ ప్రముఖులు చెబుతున్నారు.


దీంతో, పలు ప్రఖ్యాత విద్యా సంస్థలు ఈ కోర్సు లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. విద్యార్ధులు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో నైపుణ్యం సాధించటం ద్వారా మంచి ఉద్యోగాలు.. భారీ ప్యాకేజీ ఖాయమని ప్రముఖ సంస్థలు చెబుతున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ..మెషిన్ లెర్నింగ్ (ML) ఇటీవల కాలంలో టెక్ రంగాన్ని శాసించే స్థాయికి చేరాయి. కీలకమైన ఆర్దిక, ఆరోగ్య, రవాణా రంగాల్లో ఏఐ – ఎంఎల్ ప్రభావం పెరిగింది. ఫలితంగా ఈ ఏఐ- ఎంఎల్ నిపుణులకు డిమాండ్ బాగా కనిపిస్తోంది. మారుతున్న కాలం తో పాటుగా పెరుగుతున్న పోటీ రంగా ఏఐ నైపుణ్యం కీలకంగా మారింది. అవసరంగా కనిపిస్తోంది. దీంతో.. ఈ ఏఐ – ఎంఎల్ కోర్సులు చేసిన వారికి భవిష్యత్ బాగుంటుందని నిపుణు లు సూచిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా సేవా రంగంతో పాటుగా లాంగ్వేజ్ ప్రాసెసింగ్.. కంప్యూటర్ ఫోకసింగ్.. రోబోటిక్స వంటివి ఉంటాయి. అదే విధంగా మిషన్ లెర్నింగ్ ద్వారా స్పష్టమైన ప్రోగ్రామింగ్ లేకుండానే రియల్ టైం డేటాను అర్దం చేసుకొని అవసరమైన విధంగా స్పందిస్తూ.. కంప్యూటర్ వ్యవస్థలకు శిక్షణ ఇవ్వడానికి దోహదం చేస్తుంది.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మన మార్కెట్ లో ఏఐ – ఎంఎల్ టెక్నాలజీ అవసరంగా మారాయి. ఆరోగ్య సంరక్షణ, సేవా రంగా, వ్యాధి నిర్ధారణ, ఔషధ ఆవిష్కరణలో ఏఐ – ఎంఎల్ అప్లికేషన్ల నుంచి సులభంగా సేవలు అందుతున్నాయి. ఆర్దిక పరమైన మోసాలను గుర్తించటానికి ఏఐ లోని అల్గోరిథంలు సహకరిస్తున్నాయి. పెరుగుతున్న పోటీకి అనుగుణంగా సాంకేతికత వినియోగం అని వార్యంగా మారుతోంది. దీంతో, AI – ML నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ సంస్థలు AI – ML వినియోగానికి భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ కోర్సులు ప్రోగ్రామింగ్, డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం ల రూపకల్పనలో శిక్షణ ఇస్తాయి. పైథాన్ .. R వంటి ప్రోగ్రామింగ్ భాషలలో, గణాంక విశ్లేషణ, డేటా ప్రీప్రాసెసింగ్, విజువలైజేషన్ పద్ధతులలో నైపుణ్యం సాధిస్తారు. డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో కూడా శిక్షణ ఇస్తారు. AI- ML కోర్సుల గ్రాడ్యుయేట్లు టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఇ-కామర్స్, తయారీ రంగాల్లో భారీ వేతనాలతో మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.