ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. ఫీజుల పెంపుకు సర్కార్ బ్రేక్

 రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు సర్కారు బ్రేక్ వేసింది. ఈ ఏడాది పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయింది.


బుధవారం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్​ఆర్సీ) సమావేశమైంది. దీనిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై చర్చించారు. రానున్న 2025-27 మూడేండ్ల బ్లాక్ పీరియెడ్​కు ఫీజులను నిర్ణయించాల్సి ఉంది.

అయితే, టీఏఎఫ్ఆర్సీ అధికారులు సక్రమంగా ఫీజుల ప్రతిపాదనలు చేయకపోవడంతో, ఈ ఏడాది ఫీజుల పెంపును ఆపేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. ఇప్పటికే అన్ని కాలేజీల్లో ఫీజుల పెంపుపై ప్రతిపాదనలు రెడీ చేయగా, దానిపై సమీక్షించేందుకు గానూ ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాతే ఫీజుల పెంపుపై నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సమావేశం జరగ్గా, ఫీజుల పెంపు సరిగా లేదని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.