జబర్దస్త్ షో ద్వారా స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు హైపర్ ఆది. ఈయన ఏ షోకి వచ్చినా కూడా తన పంచులతో అందర్నీ ఉక్కిరి బికిరి చేస్తారు. తన ముందు ఎంత పెద్ద గొప్ప హీరో అయినా హీరోయిన్ ఉన్నా కానీ వారిని తన పంచులతోనే పడగొట్టేస్తారు.
అయితే అలాంటి హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ,జబర్దస్త్ వంటి షోలతో పాటు పలు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు.పండగ సందర్భంగా ఏదైనా ఈవెంట్ జరిగితే కచ్చితంగా అందులో హైపర్ ఆది హవా కనిపిస్తుంది. అయితే తాజాగా బుల్లితెరపై సంక్రాంతి సందర్భంగా ఎన్నో ఈవెంట్లు చేశారు.
ఇందులో భాగంగా ఓ ఈవెంట్లో హైపర్ ఆది అల్లు అర్జున్ నటించిన పుష్ప గెటప్ ని వేసి కొన్ని డైలాగులు చెప్పారు. ఇక హైపర్ ఆది ఏ హీరోకి సంబంధించిన కొత్త సినిమా వచ్చినా కూడా ఆ హీరో కి సంబంధించి గెటప్ లు వేస్తూ నవ్వులు పూయిస్తాడు.కానీ తాజాగా ఈయన చేసిన పని మాత్రం అల్లు ఫాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేసింది.మరి ఇంతకీ హైపర్ ఆది ఏం చేస్తారయ్యా అంటే.. హైపర్ ఆది, శీను, దొరబాబు వంటి వాళ్లు పుష్ప టు లోని పోలీస్ స్టేషన్ సన్నివేశాలను రీ క్రియేట్ చేశారు. ఇందులో పుష్ప పాత్రలో ఉన్న హైపర్ ఆది స్టేషన్ నుండి శీను ని వదిలి పెట్టమని అడుగుతాడు.
కుదరదు అని పోలీస్ పాత్రలో నటించిన దొరబాబు అంటే రూల్స్ నాకే చెబుతావా అని హైపర్ ఆది అంటాడు.దాంతో దొరబాబు నువ్వా అంటూ కౌంటర్ ఇస్తాడు. అయితే గతంలో చాలా సార్లు అల్లు అర్జున్ రూల్స్ పాటించలేదు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. దానికి కౌంటర్గా దొరబాబు అలా నువ్వా అని అల్లు అర్జున్ పాత్రలో నటించిన హైపర్ ఆదిని అన్నట్టు సోషల్ మీడియా జనాలు కన్వర్ట్ చేస్తున్నారు.అలాగే ఒకసారి లోపలేస్తే బయటికి తీసుకురావడానికి మా రూల్స్ ఒప్పుకోవు అని పోలీస్ పాత్రలో ఉన్న దొరబాబు అంటారు. దానికి ఆది పంచులు వేస్తూనే ఉంటారు.
దానికి దొరబాబు నిన్ను లోపల వేసినప్పుడు ఏ లోపల వేస్తే తీసుకొచ్చింది గుర్తుందా అంటూ కౌంటర్ ఇస్తాడు.అయితే ఈ కామెడీ స్కిట్ కి చాలామంది అల్లు అభిమానులు హైపర్ ఆది పై ఆయన గ్యాంగ్ పై ఫైర్ అవుతున్నారు. కామెడీ స్కిట్స్ పేరుతో మా హీరోని అవమానిస్తే ఊరుకునేది లేదు అంటూ హైపర్ ఆదికి సోషల్ మీడియాలో వార్నింగ్ లు ఇస్తున్నారు.అయితే ఈ మధ్యకాలంలో హైపర్ ఆది చేసిన ఏ విషయమైనా సరే నెగిటివ్ వే లోనే అర్థం చేసుకుంటున్నారు. అది వివాహస్పదంగా మారుతుంది.దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని హైపర్ ఆది గిచ్చి మరీ గెలికాడంటూ అల్లు ఫాన్స్ సోషల్ మీడియాలో హైపర్ ఆదికి వార్నింగ్ లు ఇస్తున్నారు.