IAS Dikshita Joshi Success Story : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షను రాస్తుంటారు. ఈ పరీక్షకు సన్నద్ధం కావడానికి చాలా మంది కోచింగ్‌లో అడ్మిషన్ తీసుకొని మరి పరీక్షకు సిద్ధమవుతారు. కానీ వారిలో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు.
ఇందులో పగలు, రాత్రి కష్టపడి పట్టుదలతో చదివే విద్యార్థులు ఉన్నారు. కొంతమంది మాత్రం ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండా కూడా సొంతంగా అధ్యయనం ద్వారా అత్యంత క్లిష్టమైన సివిల్స్ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలిచినవారు ఉన్నారు. అలా యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించిన ఒక ఐఏఎస్ IAS అధికారి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమె ఎవరో కాదు.. ఉత్తరాఖండ్‌కు చెందిన దీక్షితా జోషి.. ఎలాంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారిణి అయ్యారు. ఉత్తరాఖండ్‌లో విద్యార్థుల ప్రతిభకు కొదవలేదు. ఎందుకంటే.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన చాలా మంది ప్రతిభావంతులైన వ్యక్తులు కృషి, పట్టుదలతో మాత్రమే ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. వారి జాబితాలో హల్ద్వానీ నివాసి దీక్షితా జోషి పేరు కూడా చేరింది. పిలికోఠి ప్రాంతంలో నివసించే దీక్షిత జోషి యూపీఎస్సీ పరీక్షలో 58వ ర్యాంకు సాధించింది. దీంతో ఐఏఎస్ అధికారి కావాలనే ఆమె కల నెరవేరింది.
మొదటి ప్రయత్నంలోనే 58వ ర్యాంక్ :
ఐఏఎస్ దీక్షితా జోషి 2022 సంవత్సరంలో తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ 58తో పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె తండ్రి ఐకె పాండే నైనిటాల్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆమె ఈ ర్యాంక్ వచ్చింది. ఐఏఎస్ అధికారిణి దీక్షిత విజయంలో ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతోగానూ సహకరించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించింది.
IAS Dikshita Joshi Success Story
ఐఏఎస్ దీక్షిత జోషి ఎక్కడ చదివారంటే? :
దీక్షిత జోషి తల్లి ఇంటర్ కాలేజీలో లెక్చరర్. దీక్షితా ఆర్యమాన్ విక్రమ్ బిర్లా స్కూల్లో చదువుకుంది. హల్ద్వానీలో 10వ తరగతి, 12వ తరగతి పూర్తి చేసింది. ఆ తరువాత గ్రాడ్యుయేషన్ చదువుల కోసం జీబీ పంత్ యూనివర్శిటీలో అడ్మిషన్ పొందింది. ఐఐటీ మండిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు బాగా ప్రీపేర్ అయింది. ఎలాగైనా ఐఏఎస్ కావాలని పట్టుదలతో చదివింది. ఆమె నిరంతర కృషికి మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారిణి అయింది.
అభ్యర్థులకు దీక్షిత చెప్పిన టిప్స్ ఇవే :
ఐఏఎస్ దీక్షితా జోషి యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రత్యేక టిప్స్ అందించింది. అపజయానికి భయపడవద్దని ఆమె తెలిపింది. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యమని చెప్పింది. దాంతో పాటు, యూపీఎస్సీకి ప్రీపేర్ అయ్యే అభ్యర్థులు ఎన్‌సిఇఆర్‌టి (NCERT) పుస్తకాల నుంచి అవసరమైన నోట్స్ తయారు చేసుకోవాలని చెప్పింది. యూపీఎస్సీ కోసం సిద్ధమయ్యే ప్రతిఒక్క అభ్యర్థికి ఐఏఎస్ దీక్షిత్ జోషి సక్సెస్ స్టోరీ ఒక రోల్ మోడల్‌గా నిలిచింది.