గోవింద కోటి రాస్తే బ్రేక్‌ దర్శనం

www.mannamweb.com


కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారి దర్శనంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లలోపు యువత ‘గోవింద కోటి’ అని పది లక్షల 116 సార్లు రాస్తే శ్రీవారి బ్రేక్‌దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
యువతలో తిరుమల శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో, సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,664 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.