కొత్త రెడ్‌మి ఫోన్ కావాలా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ రెడ్‌మి నోట్ 14 ప్రో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఏడాదిలో లాంచ్ అయిన బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ భారీగా తగ్గింది.
కొనుగోలుదారులు ఈ ప్రో మోడల్ కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ముఖ్యంగా 256GB వేరియంట్ ధర కేవలం రూ. 25,999 నుంచి తగ్గింపు ధరకే లభిస్తోంది.
రెడ్‌మి నోట్ 14 ప్రో డిస్కౌంట్ :
అమెజాన్ ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే.. రూ.2వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్, రూ.779 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ధర దాదాపు రూ.22,200కి తగ్గుతుంది. అదనంగా, కేవలం రూ.1,260 ప్రారంభ ఈఎంఐతో కొనుగోలు చేయొచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కొనుగోలు ధర రూ. 24,500 వరకు తగ్గుతుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 7వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. రెడ్‌మి నోట్ 14 ప్రో మొత్తం బ్లాక్, గ్రీన్, ఫాంటమ్ పర్పుల్ వంటి 3 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో వస్తుంది.
రెడ్‌మి నోట్ 14 ప్రో స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.67-అంగుళాల FHD+ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 3000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ లెవల్స్ అందుకోగలదు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. 8GB ర్యామ్, మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. హైపర్OS 2పై రన్ అయ్యే ఆండ్రాయిడ్ 15 ఆధారంగా యూజర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
రెడ్‌మి నోట్ 14 ప్రో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. రోజంతా పవర్ అందిస్తుంది. IP69 రేటింగ్‌తో వస్తుంది. ఈ రెడ్‌మి ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఇందులో 50MP మెయిన్ OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.