మీరు శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయాలు మీకు తెలియకపోతే, వెళ్లకపోవడమే మంచిది.

వారాంతంలో శ్రీశైలం వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్. శనివారం, ఆదివారం, సోమవారం రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నారు.


ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. అందులోనూ సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీశైలం ఆలయం సందడిమయ వాతావరణంగా మారింది. భక్తులు వేకువ జాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి..శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో, దర్శన కంపార్ట్ మెంట్లలో బారులు తీరుతున్నారు.

ప్రస్తుతం శ్రీస్వామి, అమ్మవారి దర్శనానికిసుమారు 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని ద్రుష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం వంటి రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్జనలను నిలిపివేశారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల సర్వ దర్శనాన్ని కూడా పరిమితం చేశారు. ఈ దర్శనం కేవలం రెండు విడతల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. ఉదయం 7.30గంటలకు రాత్రి 9.00గంటలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యవంతమైన దర్శనం కోసం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు నేత్రుత్వంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు వంటివి ఎప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్ల ద్వారా భక్తులు సౌకర్యవంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.