ఇతరులకు మీ రహస్యాలు తెలియకూడదనుకుంటే..? వాట్సాప్‌లో ఇలా చేయండి

ఈ రోజుల్లో వాట్సాప్ యూజ్ చేయనివారు ఎవరైనా ఉంటారా?


‘నో..! నెవర్!’ అత్యధికమంది చెప్పే సమాధానం ఇదే.

ఎందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు వాడుతున్నారు.

ఇండియాలో అయితే 53. 2 కోట్ల మంది యూజ్ చేస్తున్నారు.

ఇక యూత్ అయితే మరింత ఎక్కువగా నిమగ్నమైపోతోంది.

ఫ్రెండ్స్‌తో, పరిచయస్తులతో మాట్లాడేందుకు, ఛాటింగ్ చేసేందుకు వినియోగించుకుంటోంది.

ఒక విధంగా చెప్పాలంటే.. ఆధునిక సాంకేతిక రంగంలో ది గ్రేట్ కమ్యూనికేటర్‌ వాట్సాపే..గురూ!

అవును.. అంత పాపులారిటీ ఉంది కాబట్టే వాట్సాప్ మేనేజ్‌మెంట్ మెటా (Meta)రోజు రోజుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. తన వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటికే అందులో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ సెట్టింగ్స్ అండ్ సీక్రెట్స్ గురించి కొందరికి తెలియకపోవచ్చు. అవేంటో చూద్దామా?

* మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోండి : రోజూ ఎంతోమందితో వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంటాం. అయితే మీరు ఎవరితో ఎక్కువగా చాట్ చేస్తున్నారో కొన్నిసార్లు మీది మీకే తెలియకపోవచ్చు. కానీ వాట్సాప్ ఈ సీక్రెట్‌ను తెలియజేస్తుంది. మీరు ప్రతిరోజూ ఎక్కువగా మాట్లాడుతున్న క్లోజ్ ఫ్రెండ్ ఎవరో (Find a close friend on WhatsApp) చెప్పేస్తుంది. మీ డేటా యూసేజ్‌ని కూడా చెక్ చేయవచ్చు. అందుకోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.. తర్వాత స్టోరేజ్ అండ్ డేటాపై క్లిక్ చేసి, మేనేజ్ స్టోరేజ్‌కి వెళ్లండి. డేటా యూసేజ్ ఆధారంగా మీ కాంటాక్ట్స్, గ్రూప్ లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ టాప్‌లో ఎవరు కనిపిస్తారో వాళ్లతో మీరు ఎక్కువగా చాట్ చేస్తున్నట్లు లెక్క.

*మెసేజ్ చదివినట్లు తెలియకుండా : ఇది మీకు తెలిసే ఉంటుంది. ఎవరైనా వాట్సాప్‌లో మెసేజ్ (Message on WhatsApp) పంపినప్పుడు దానిని చదివితే.. అవతలి వ్యక్తి మనం చదివినట్లు గుర్తింగలుగుతారు. ఎందుకంటే బ్లూ టిక్స్ వస్తాయి. అలా కాకుండా మీరు అవతలి వ్యక్తి పంపిన మెసేజ్ చదివినప్పటికీ వారికి తెలియకుండా ఉండాలనుకుంటున్నారా? అందుకు చక్కటి మార్గం ఉంది. ఏంటంటే.. వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి, ప్రైవసీపై క్లిక్ చేయండి. ఆ తర్వాత రీడ్ రిసీప్ట్స్‌ (Read receipts)కి వెళ్లి దానిని ఆఫ్ చేయండి. దీంతో మీరు మెసేజ్ చదివినా అది పంపిన వారికి బ్లూ టిక్స్ (Blue ticks) కనిపించవు. మరో విషయం.. ఇది ఆన్ చేశాక, మీ మెసేజ్‌లు కూడా ఇతరులు ఎప్పుడు చదివారన్న విషయం గుర్తించలేరు.

*సీక్రెట్‌గా చదివేందుకు: బ్లూటిక్స్ (Read receipts) ఆఫ్ చేయకుండా సీక్రెట్‌గా సందేశాలు చదవాలనుకుంటే.. అందుకు కూడా చక్కటి మార్గం ఉంది. ఏంటంటే ఎయిరోప్లేన్ మోడ్‌(Airplane mode)ను ఆన్ చేయడం. ఇలా చేసి వాట్సాప్ మెసేజ్ చదివి, ఆఫ్ చేసేకంటే ముందు క్లోజ్ చేస్తే చాలు. ఇలా చేసినా మీరు మెసేజ్ చదివినట్లు, దానిని పంపిన వారికి బ్లూటిక్ పడదు.

*అడిషనల్ ప్రైవసీ సెట్టింగ్స్ : మీరు వాట్సాప్ యూజ్ చేస్తుంటారు. అయితే మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా? అనేది మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారు ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. అలా జరగకూడదంటే లాస్ట్‌సీన్ స్టేటస్ (Lastseen status) ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అందుకోసం ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ప్రైవసీపై (On privacy) క్లిక్ చేయండి. అక్కడ లాస్ట్ సీన్ అండ్ ఆన్ లైన్‌లోకి వెళ్లి ‘నో బడి (nobady)’ ఆప్షన్ ఎంచుకోండి. దీనివల్ల మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఇతరులు గుర్తించలేరు. ఎందుకంటే మీ లాస్ట్ సీన్ (Lastseen) వారికి కనిపించదు.

* ప్రైవేట్‌గా పబ్లిక్ ఇన్వైట్ : ఇతరులను ఇన్వైట్ (Invite) చేయాలంటే సాధారంగా పబ్లిక్ గ్రూప్ చాట్‌(Public group chat)ను క్రియేట్ చేస్తుంటాం. కానీ ఇలా చేయకుండానే మీరు అనుకోబోయే కార్యక్రమానికి ఎక్కువమందిని ఆహ్వానించవచ్చు. అందుకోసం వాట్సాప్ బ్రాడ్ కాస్ట్ (WhatsApp Broadcast)ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఇందులో ఎవరున్నారో కూడా ఇతరులకు తెలియదు. సో.. అందరికీ ఒకేసారి మీరు అనుకున్న మెసేజ్ పంపవచ్చు. అందుకోసం వాట్సాప్ చాట్స్ (WhatsApp chats) ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ త్రీ డాట్స్ మెనూపై క్లిక్ చేయండి. తర్వాత ‘న్యూ బ్రాడ్ కాస్ట్ సెలెక్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు మెసేజ్ పంపాలనుకున్న కాంటాక్ట్స్‌ను యాడ్ చేసి పంపవచ్చు. దీంతో ప్రతీ వ్యక్తికి ఇండివిడ్యువల్ మెసేజ్ వెళ్తుంది.

*ఎవరెవరు చదివారు : మీరు గ్రూప్ చాట్‌లో ఒక మెసేజ్ పంపుతారు. అందరూ చదివితేనే బ్లూటిక్స్ కనిపిస్తాయి. కొందరు చదవకపోతే కనిపించదు. అలాంటప్పుడు ఎవరెవరు మీ మెసేజ్ చదివారో ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్.. ఆండ్రాయిడ్‌లో మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి టాప్‌లో ఇన్‌ఫో(Info) ఐకాన్‌పై క్లిక్ చేయండి. ఇక ఐఫోన్ యూజర్లై(iPhone users)తే లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే చాలు. మెసేజ్ ఎవరు ఎప్పుడు చదివారన్నది తెలిసిపోతుంది.

*వెంటనే ఓపెన్ కావాలి : కాంటాక్ట్ లిస్టు (Contact list)లో చాలామంది ఉంటారు. కానీ మీకంటూ ఓ స్పెషల్ పర్సన్ (Special Person) లేదా కొందరు ప్రత్యేక వ్యక్తులు ఉంటారు. గ్రూప్‌లో వాళ్ల మెసేజ్ మాత్రమే చూడాలనుకుంటారు. కానీ ఎలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అందుకోసం షార్ట్‌కట్ క్రియేట్ చేస్తే చాలు. మీరు రెగ్యులర్‌గా చాట్ చేసే వ్యక్తి లేదా గ్రూప్ ఓపెన్ అవుతుంది. అందుకోసం హోమ్ స్క్రీన్‌లో షార్ట్‌కట్ క్రియేట్ చేయవచ్చు. ముందుగా చాట్ (Group or person) ఆప్షన్‌పై లాంగ్ ప్రెస్ చేసి, ‘యాడ్ కన్వర్జేషన్ షార్ట్‌కట్(Ad conversion shortcut)’పై క్లిక్ చేస్తే చాలు. అప్పుడు హోమ్ స్క్రీన్‌లో చాట్ షార్ట్‌కట్ కనిపిస్తుంది. కాగా ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.