వైట్‌రైస్ బదులు బ్రౌన్‌రైస్ తింటే ఈ సమస్యలన్నీ దూరం..

www.mannamweb.com


బ్రౌన్‌రైస్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వైట్ రైస్ బదులు బ్రౌన్‌రైస్ తింటారు. బ్రౌన్‌రైస్ చూడ్డానికి కాస్తా లేత గోధుమ రంగులో ఉంటాయి. బ్రౌన్‌రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని వైట్ రైస్ బదులు తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి.

పోషకాలు ఎక్కువ..
మీ రోజువారీ ఆహారంలో బ్రౌన్‌రైస్ తీసుకుంటే పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఇందులో సెలీనియం, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం మనకి అందుతాయి.ఇందులో ఫైబర్, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్నింటి కంటే తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.

కొలెస్ట్రాల్ తగ్గడం..
పీచుతో కూడిన బ్రౌన్‌రౌస్‌ని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.

అజీర్ణ సమస్యలు..
బ్రౌన్‌రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఈ బ్రౌన్‌రైస్‌ని వరిపై పొట్టుని మాత్రమే తీసి ఉంచుతారు. పాలిష్ ఉండదు. దీని వల్ల పేగు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.

షుగర్ కంట్రోల్..
ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ కారణంగా రక్తంలో చక్కెర పెరుగుతుంది. తెల్ల బియ్యంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ ఉన్నవారు బ్రౌన్‌రైస్ తీసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్, సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ ఉత్పత్తిని స్థిరంగా ఉంచడంలో సాయపడతాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉన్నందున రక్తంలో చక్కెర పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు.

బరువు తగ్గేందుకు..
ఇతర సీజన్స్ కంటే సమ్మర్‌ని భరించడం కాస్తా కష్టమైనది. ఈ టైమ్‌లో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీని వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. వీటిని అధిగమించాలంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడం కాస్త కష్టమైన పనే. దీనికోసం బ్రౌన్‌రైస్ మీకు హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ రోజువారీ ఆహారంలో బ్రౌన్‌రైస్‌ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీని వల్ల చాలా కాలం పాటు ఆకలి కంట్రోల్ అవుతుంది. ఆకలిని ప్రేరేపించే హార్మోన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. దీంతో కేలరీను కూడా తగ్గించుకోవచ్చు. దీంతో బరువు తగ్గుతారు.

బ్రౌన్‌రైస్‌తో సైడ్‌ఎఫెక్ట్స్..
వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలుండవు. కొంతమందికి కొన్ని ధాన్యాల్లో ఆర్సెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులని పెంచుతాయి. బ్రౌన్‌రైస్‌లో ఆ ఆర్సెననిక్ గుణం కూడా ఉంటుంది. రోజుకి అరకప్పు బ్రౌన్‌రైస్ తినండి. ఇందులో దాదాపు 110 కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గేవారు రోజూ తీసుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.