ఎన్ని కోట్లు అయినా జీతం.. ఏఐ టాలెంట్ ఉంటే చాలు.. మెటా సీఈవో జుకర్ బర్గ్ భారీ ఆఫర్

Mark Zuckerberg AI ఏఐపై గుత్తాధిపత్యం కోసం టెక్‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. జనరేటివ్‌ ఏఐ అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో మెటా సీఈఓ మార్క్‌ జుకర్బర్గ్‌ అగ్రశ్రేణి ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీలు, వ్యక్తిగత సంప్రదింపులతో కీలక ప్రచారం ప్రారంభించినట్లు సమాచారం

ప్రస్తుతం ఏఐ జనరేషన్‌ కొనసాగుతోంది. అన్ని రంగాల్లోకి కృత్రిమ మేధ ప్రవేశిస్తోంది. దీంతో అన్ని సంస్థలు ఏఐపై దృష్టిపెట్టాయి. జనరేటివ్‌ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్రమంలో గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్‌ఏఐ వంటి దిగ్గజ సంస్థల మధ్య పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ రంగంలో ఆధిపత్యం సాధించేందుకు కంపెనీలు భారీ పెట్టుబడులు, వినూత్న వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.


ఏఐపై గుత్తాధిపత్యం కోసం టెక్‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. జనరేటివ్‌ ఏఐ అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో మెటా సీఈఓ మార్క్‌ జుకర్బర్గ్‌ అగ్రశ్రేణి ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీలు, వ్యక్తిగత సంప్రదింపులతో కీలక ప్రచారం ప్రారంభించినట్లు సమాచారం. ఈ వ్యూహం ఏఐ రంగంలో మెటా ఆధిపత్య ఆకాంక్షలను స్పష్టం చేస్తోంది.

భారీ ప్యాకేజీలతో ఆకర్షణ..
మైక్రోసాఫ్ట్‌ సంస్థ లేఆఫ్‌ పేరుతో ఉద్యోగులను తొలగిస్తుంటే.. మెటా మాత్రం ఏఐ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు అసాధారణ చర్యలు తీసుకుంటోంది. 100 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.860 కోట్లు) వరకు భారీ ప్యాకేజీలతో టాప్‌ ఏఐ నిపుణులను నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యూహం గూగుల్, ఓపెన్‌ఏఐ వంటి సంస్థలతో పోటీలో మెటాను ముందంజలో నిలిపే అవకాశం ఉంది.

వ్యక్తిగత సంప్రదింపులు..
మార్క్‌ జుకర్బర్గ్‌ స్వయంగా ఏఐ పరిశోధకులు, డెవలపర్లు, స్టార్టప్‌ స్థాపకులను వాట్సాప్, ఈమెయిల్‌ ద్వారా సంప్రదిస్తున్నారు. ఈ వ్యక్తిగత సంప్రదింపులు నియామకాలతోపాటు ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏజీఐ), భవిష్యత్తు ఏఐ వ్యూహాలపై చర్చలను కూడా కలిగి ఉన్నాయి.

స్కేల్‌ ఏఐ సముపార్జన..
మెటా 14 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.2 లక్షల కోట్లు) విలువైన స్కేల్‌ ఏఐ స్టార్టప్‌ను కొనుగోలు చేసింది. ఈ సముపార్జన ద్వారా సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాత అలెగ్జాండర్‌ వాంగ్‌ నేతృత్వంలో మెటా ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయనుంది.

సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌..
మెటా మానవ స్థాయి కృత్రిమ మేధస్సు (ఏజీఐ) సాధనకు ’సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌’ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ల్యాబ్‌ ప్రపంచంలోని అత్యుత్తమ ఏఐ నిపుణులతో నడవాలని మెటా భావిస్తోంది. ఈ ల్యాబ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా టాప్‌ స్కిల్డ్‌ పర్సన్స్‌ను నియమించుకోవడం మెటా ప్రధాన ఎజెండా. ఈ నియామకాలకు భారీ ప్యాకేజీలు, ఆకర్షణీయ సౌకర్యాలు ఆఫర్‌ చేస్తోంది.

ఏజీఐపైనా దృష్టి..
ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అభివృద్ధి ద్వారా మెటా ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఇది దీర్ఘకాలికంగా మెటా ఉత్పత్తులు, సేవలను మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉంది. అయితే మెటా దూకుడు వ్యూహం అన్ని విధాలుగా విజయవంతం కాకపోవచ్చు. కొన్ని సవాళ్లు ఈ ప్రయత్నాలకు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. భారీ ప్యాకేజీలు ఆఫర్‌ చేసినప్పటికీ, కొందరు ఏఐ నిపుణులు మెటాతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. వారు స్థాపించిన స్టార్టప్‌లను వదులుకోవడానికి ఇష్టపడకపోవడం ఒక కారణం. మార్క్‌ జుకర్బర్గ్, మెటా ఏఐ చీఫ్‌ సైంటిస్ట్‌ యాన్‌ లెకున్‌ మధ్య ఫిలాసఫికల్‌ తేడాలు సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌ యొక్క దీర్ఘకాలిక విజయంపై అనిశ్చితిని సృష్టిస్తున్నాయి.

మెటా ఈ వ్యూహం ఏఐ రంగంలో దాని స్థానాన్ని బలోపేతం చేసే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని బలహీనతలు కూడా కనిపిస్తున్నాయి. భారీ ప్యాకేజీలు, వ్యక్తిగత సంప్రదింపుల ద్వారా అగ్రశ్రేణి నిపుణులను ఆకర్షించే అవకాశం. స్కేల్‌ ఏఐ వంటి సముపార్జనల ద్వారా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడం.
సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌ ద్వారా ఏజీఐ అభివృద్ధిలో ముందంజ వేయడం బలాలుగా కనిపిస్తున్నాయి. నిపుణుల విముఖత, ఫిలాసఫికల్‌ విభేదాల వల్ల ల్యాబ్‌ యొక్క దీర్ఘకాలిక విజయంపై అనిశ్చితి. గూగుల్, ఓపెన్‌ఏఐ వంటి సంస్థలతో తీవ్రమైన పోటీ మెటా వ్యూహాలను పరీక్షకు పెట్టవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.