Health tips : ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అనారోగ్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువగా మనకు గుండె పోటు మరణాలు సంభవిస్తాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో మాత్రమే ఈ అనారోగ్యాలు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న వయసు వారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా గుండె జబ్బులు రావద్దంటే రక్తం పలుచగా ఉండేలా చూసుకోవాలి. రక్తం పలుచగా ఉంటేనే గుండెకు పంపింగ్ సులభమవుతుంది. అందుకే రక్తాన్ని పలుచగా చేసుకునేందుకు రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు. ఒకసారి గుండె జబ్బులు, అధిక రక్తపోటు లాంటివి వస్తే మాత్రం ఈ మెడిసిన్స్ జీవితకాలం వాడాల్సిందే. లేదంటే లైఫ్ స్టైల్‌ను పూర్తిగా ఛేంజ్ చేసుకోవాలి.
చాలామంది ఉప్పు, నూనె, నెయ్యి లాంటివి ఎక్కువగా తింటున్నారు. ఇలాంటి వాటి వల్లనే రక్తం చిక్కగా మారుతుంది. ఒకసారి రక్తం చిక్కగా మారితే దాన్ని పలుచగా చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి రక్తం చిక్కబడక ముందే లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలి. ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ ఉప్పు లేకుండా ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఉదయం, సాయంత్రం తక్కువగా ఉడికిన ఫుడ్ తీసుకోవాలి.
మధ్యాహ్నం సమయంలో మాత్రం ఉడికిన ఫుడ్ తింటే బెటర్. అంతే కాకుండా అందులో ఉప్పు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వేసుకున్నా కూడా మోతాదు కంటే తక్కువ ఉంటేనే మంచిది. బయటి ఫుడ్స్ పూర్తిగా మానేయాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆయిల్ ఎక్కువగా ఉండేవి అస్సలు తినొద్దు. అలాంటి లైఫ్‌స్టైల్‌ను ఫాలో అయితే నెలా, రెండు నెలల తర్వాత మెడిసిన్ మానిసేనా ఇబ్బందిలేని స్థాయిలో ఆరోగ్యం మెరుగుపడుతుంది.