మన ఇంట్లో డబ్బు, బంగారం లాంటివి భద్రంగా ఉంచటానికి లాకర్ అవసరం. అయితే, ఇంట్లో లాకర్ ఉంచడానికి కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి.
వాటిని పాటించడం ద్వారా ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం, లాకర్‌ను సరైన చోటు, సరైన దిశలో ఉంచితే మనకు సంపద పెరిగుతుంది, సమస్యలు తగ్గుతాయి. కాబట్టి, లాకర్‌కు సంబంధించిన వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సరైన దిశ
వాస్తు ప్రకారం, లాకర్‌ను నైరుతి లేదా ఉత్తరం దిశలో ఏర్పాటు చేయాలి. ఈ దిశలలో లాకర్ ఉంచడం చాలా శుభప్రదం. అలా ఉంచడం వల్ల ఇంట్లో సంపద, శ్రేయస్సు ఉంటుందని, లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. అలాగే, లాకర్ ముందు తలుపు, అలాగే దాని వెనుక కిటికీ లాంటివి లేకుండా చూసుకోవాలి.
లాకర్‌లో ఏమి ఉంచాలి?
వాస్తు ప్రకారం, లాకర్‌లో డబ్బును మాత్రమే ఉంచాలి. ఎలాంటి పత్రాలు లేదా కాగితాలు అందులో ఉంచడం మంచిది కాదు. కేవలం డబ్బును మాత్రమే అందులో ఉంచాలి. అప్పుడే జీవితంలో ఆర్థిక శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు.
లాకర్ ఏ రంగులో ఉండాలి?
వాస్తు ప్రకారం, లాకర్ రంగు లేత పసుపు, తెలుపు లేదా క్రీమ్ రంగులో ఉండటం శుభప్రదం.
జాగ్రత్త
వాస్తు ప్రకారం, లాకర్ ఎప్పుడూ మురికిగా ఉండకూడదు. దానిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు.