ఇంట్లోకి చీమలు, దోమలు వస్తూనే ఉంటాయి. ఇవి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్టే అనిపిస్తుంటుంది. అయితే మీరు ఇల్లు తుడిచి నీటిలో ఒకటి కలిపితే మీ ఇంట్లోకి ఒక్క చీమ, దోమ కూడా రాదు.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. చాలా మంది ఆడవారు ప్రతి రోజూ ఇంటిని తుడుస్తూనే ఉంటారు. కానీ చీమలు, దోమలు, ఇతర చిన్న చిన్న పురుగులు రావడం మాత్రం ఆగదు. ఇది చిరాకు తెప్పిస్తుంది. అయితే ఇంటిన తుడిచే నీటిలో కొన్ని వస్తువులను కలిపితే ఇంట్లోకి చీమలు రావు. దోమలు,ఇతర కీటకాలేమీ రావు. ఇందుకోసం ఏం చేయాలంటే?
వెనిగర్
ఇల్లును తుడిచేటప్పుడు నీటిలో కొంచెం వెనిగర్ ను కలపండి. వెనిగర్ నేల తలతల మెరిసేలా చేస్తుంది. అలాగే వాటర్, వెనిగర్ మిశ్రమం కీటకాలు, దోమలు ఇంట్లోకి రాకుండా చేస్తుంది. ఎండాకాలంలో మీ ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే వెనిగర్ ను నీటిలో కలిపి తుడవండి.
ఎసెన్షియల్ ఆయిల్
ఇంటిని తుడిచే నీటిలో మీరు ఎసెన్షియల్ ఆయిల్ ను కలపొచ్చు. అంటే లావెండర్ ఆయిల్, పిప్పరమింట్ ఆయిల్ ను నీటితో కలిపి తుడిస్తే తీసుకుంటే మీ ఫ్లోర్ చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. అలాగే ఇంట్లోకి కీటకాలు, దోమలు వంటివి వచ్చే సమస్యే ఉండదు.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కను వేసి నీళ్లను మరిగించాలి. ఈ వాటర్ తో మీ ఇంటిని మొత్తం క్లీన్ చేయండి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల నేలలోని మురికి కూడా శుభ్రపడుతుంది.