పిచ్చాకులు అనుకుంటే పొరబడినట్లే.. సర్వరోగ నివారిణి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రమే

ప్రకృతి ఎన్నో రకాల సహజ ఔషధ మొక్కలను ప్రసాదించింది.. ఈ మొక్కలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి.. అలాంటి పవర్‌ఫుల్ ఔషధ మొక్కల్లో తిప్పతీగ ఒకటి..


తిప్పతీగతో తిప్పలన్నీ దూరం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. తిప్పతీగ.. ఆకులు, కాండం, వేర్లు.. అన్ని విలువైనవే.. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగతో జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ ను తయారు చేస్తారు. తిప్పతీగను ఎలా తీసుకున్నా శరీరానికి మంచిదే.. అందుకే.. తిప్పతీగను తిరుగులేని శక్తివంతమైన ఔషధ మొక్కగా అభివర్ణిస్తారు..

తిప్పతీగ రసం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శరీరానికి శక్తిని అందించి.. మూలకాలను మెరుగుపరచడానికి, పోషించడానికి సహాయపడుతుంది. అలాగే.. తిప్పతీగలోని ఔషధ గుణాలు.. మధుమేహం, చర్మవ్యాధులు, కీళ్ల వ్యాధులు, నులిపురుగులు, జ్వరం మొదలైన వాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. తిప్పతీగను తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకోండి.

తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు..

తిప్ప తీగలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి.. ఇవి తరచుగా వచ్చే దగ్గు, జలుబు, టాన్సిలిటిస్ వంటి సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోరాడతాయి..

తిప్పతీగ తీసుకోవడం ద్వారా ఉబ్బసం రోగులకు కూడా ఉపశమనం లభిస్తుంది.. ఛాతీ బిగుతుగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, గురక వంటి లక్షణాలను తిప్పతీగ తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

తిప్పతీగ ఆకులతోపాటు బెల్లం కలిపి తీసుకుంటే.. మలబద్ధకం సమస్య దూరమవుతుంది.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

డయాబెటిస్ కూడా తిప్పతీగ మంచిగా పనిచేస్తుంది. దీని జ్యూస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది.

తిప్పతీగ శరీరంలో రోగ నిరోధకశక్తిని మెరుగుపర్చి అనేక వ్యాధులను నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అయితే.. తిప్పతీగ కషాయాన్ని ఉదయాన్నే తాగితే చాలా మంచిది.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.