పెద్ద పెద్ద సంస్థలు తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త కార్యకలాపాలను నిర్వహించడానికి భారీగా భూములను సేకరిస్తుంటాయి. ఆల్రెడీ అభివృద్ధి చెందిన హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎకరాల్లో భారీ స్థాయిలో భూములుదొరకడం అనేది కష్టం.
పైగా ఒకేచోట పెట్టడం కంటే నగరం చుట్టుపక్కల కూడా పెట్టుబడి పెడితే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు డెవలప్ అవుతాయన్న ఉద్దేశంతో నగర శివారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. పైగా భూముల ధరలు కూడా చౌకగా ఉంటాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ భారీగా భూములను కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో దిగ్గజ కంపెనీగా పేరొందింది.
గజం 10 వేలు:
అలాంటి కంపెనీ అతిపెద్ద డేటా సెంటర్ల కోసం హైదరాబాద్ లో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. గతంలో హైదరాబాద్ తో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో ఫరూఖ్ నగర్ మండలంలో ఉన్న ఎలికట్ట గ్రామంలో ఎకరానికి రూ. 5.56 కోట్లు చెల్లించి మరీ రూ. 267 కోట్లకు 48 ఎకరాలను కొనుగోలు చేసింది. ఈ మొత్తం భూమిని డేటా సెంటర్ కోసమే కొనుగోలు చేసినట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే షాద్ నగర్ దగ్గర ఒక డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది మైక్రోసాఫ్ట్. ఆ డేటా సెంటర్ విస్తరణ నేపథ్యంలో ఎలికట్టలో కొంత భూమిని కొనుగోలు చేసింది. ఎకరం 5 కోట్లు పెట్టి కొన్నదంటే.. గజం 11,600 పెట్టి కొన్నట్టు. అంటే చదరపు అడుగు రూ. 1290కి కొన్నట్టు. అయితే కమర్షియల్ పర్పస్ కాబట్టి గజం 11 వేల చిల్లరకి మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. అదే రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఐతే గజం 10 వేలకే దొరకచ్చు.
షాద్ నగర్ లోనే గజం స్థలం రూ. 13,950 ఉంది. ఎలికట్టలో ఇంకా తక్కువ ఉండచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ఉద్దేశం ఉన్నవారికి ఇదే సరైన అవకాశం. ఇంతకంటే తక్కువ ధరకు ల్యాండ్ అనేది ఫ్యూచర్ లో దొరకడం కష్టం. దొరికినా ఇప్పుడున్న రేట్లకు దొరకడం అనేది కష్టం. డేటా సెంటర్ ప్రాజెక్ట్ పూర్తయితే ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఇప్పుడు గజం 10 వేలు పెట్టి కొంటే ఫ్యూచర్ లో లక్షల్లో లాభాలు పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. గజం 10 వేలు అంటే 100 గజాలకు 10 లక్షలు అవుతుంది. ఎలికట్ట నుంచి హైదరాబాద్ 59 కి.మీ. దూరంలో ఉంది. షాద్ నగర్ కి 10 కి.మీ. దూరంలో ఉంది. కాబట్టి స్థలాల మీద ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి తరుణం.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.