Income Tax: రూ.18 లక్షల ఆదాయం ఉన్నా..నో ట్యాక్స్‌.. ఎలా సాధ్యమో తెలుసా?

ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో రూ. 12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా చేసిన విషయం తెలిసిందే. కానీ మీ జీతం రూ. 12 లక్షల కంటే ఎక్కువ ఉంటే పన్ను ఆదా చేసే ఆప్షన్‌ ఏదైనా ఉంటుందా?


మీరు రూ. 12 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని పన్ను రహితంగా చేయాలనుకుంటే, కొత్త పన్ను విధానం ప్రకారం మీరు ఈ ట్రిక్‌ను అనుసరించవచ్చు. ఈ ట్రిక్ తో మీరు రూ. 18 లక్షల వరకు జీతంపై కూడా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మీ పన్ను బాధ్యత సున్నా అయ్యే విధంగా చేసుకోవచ్చు.

పన్ను ఆదా చేసుకునే మార్గం

మీ ప్రాథమిక జీతం, డీఏ రూ.12.25 లక్షలు అయితే, దానిని వివిధ భత్యాలు, ప్రయోజనాల ద్వారా పన్ను రహితంగా చేయవచ్చు. ఉదాహరణకు.. NPS సహకారం రూ.1.71 లక్షలు, మోటారు కారు సౌకర్యంగా రూ. 4 లక్షలు, బహుమతిగా రూ. 5,000 జోడించవచ్చు. ఈ విధంగా మీ గ్రాస్‌ సాలరీ రూ. 18.01 లక్షలు అవుతుంది.

దానికి పన్ను మినహాయింపు ఎలా అవుతుంది?

NPS సహకారం: సెక్షన్ 80CCD(2) కింద బేసిక్, DAలో 14% వరకు NPS సహకారం పన్ను రహితంగా పరిగణిస్తారు. దీని వలన రూ. 1.71 లక్షల పొదుపు లభిస్తుంది.
గిఫ్ట్ అలవెన్స్: కంపెనీ ఇచ్చే రూ. 5,000 వరకు బహుమతులు సెక్షన్ 17(2)(vii) నియమం 3(7)(iv) ప్రకారం పన్ను రహితంగా ఉంటాయి.
స్టాండర్డ్ డిడక్షన్: జీతం పొందే ఉద్యోగులందరూ రూ. 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హులు.