ఐదు రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముంబైలోని GSB గణనాథుడి నిమజ్జనం పూర్తయింది. ఈ రిచెస్ట్ వినాయకుడి శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అయితే, సముద్రంలో నిమజ్జనం చేసేవరకూ 66 కిలోల బంగారు ఆభరణాలను విగ్రహానికే ఉంచి, సముద్రం వద్దకు చేరాక వినాయకుడి బంగారు, వెండి ఆభరణాలను తొలగించి, నిమజ్జనం చేశారు. ఇకపోతే, GSB గణనాథుడి విశిష్టత ఎంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ముంబైలో అత్యంత సంపన్న గణేష్ మండలిగా GSB సేవా మండల్ పేరుగాంచింది. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో GSB సేవా మండల్ రికార్డు స్థాయిలో రూ.400.58 కోట్ల బీమా కవరేజి తీసుకుంది. చవితి వేడుకల నిర్వహణలో పని చేసే కార్మికులు అందరికీ వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు బంగారం, వెండి చోరీ, భూకంపం, అగ్ని ప్రమాదం వంటి అంశాలను ఈ పాలసీ కవర్ చేస్తుంది.
2023లోనూ ఇక్కడి వినాయకుడికి రూ.360.40 కోట్లతో బీమా తీసుకున్నారు. దాంతో ఈ వినాయకుడు జాతీయ మీడియాను ఆకర్షించాడు. ఇక ఇక్కడికి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సేవలు, క్యూఆర్ కోడ్ వంటివి అందుబాటులో పెట్టారు.