వాలెంటైన్స్ డే దగ్గర పడుతోంది.. స్పెషల్ ఆఫర్లతో జంటలను ఆకర్షించడానికి రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పబ్ లు.. స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణానికి ఈనెల 16 వరకు బుక్‌చేసే టికెట్లపై 50 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ఇద్దరు ప్రయాణికులు కలిసి బుక్‌చేస్తేనే ఆఫర్ వర్తిస్తుంది. బుకింగ్‌కి, ప్రయాణానికి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి. తొలి 500 మందికి అదనంగా మరో 10 శాతం రాయితీ లభిస్తుంది.
Also Read
Education
More