ఇన్ స్టెంట్‌గా టమాటా రవ్వ దోశ.. టేస్ట్ వేరే లెవల్ అంతే

www.mannamweb.com


దోశలు అంటే చాలా మందికి ఇష్టం. దోశల్లో అనేక రకాలు వచ్చాయి. దోశల్లో రవ్వ దోశ కూడా ఒకటి. ఆఫీస్‌కి వెళ్లేవారికి ఉదయం టిఫిన్ త్వరగా అవ్వాలంటే వాటిల్లో రవ్వ దోశ ఒకటి.

రవ్వ దోశల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎప్పుడైనా వెరైటీగా, టేస్టీగా ఏమైనా తినాలనిపించినా టమాటా రవ్వ దోశలు వేసుకుని తినవచ్చు. ఇవి చేయడం కూడా చాలా సింపుల్. రుచిగా కూడా ఉంటాయి. తక్కువ సమయంలోనే ఈ టమాటా రవ్వ దోశలను తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్లకు కూడా ఇవి బాగా నచ్చుతాయి. మరి ఈ రవ్వ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

టమాటా రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు:

రవ్వ, బియ్యం పిండి, అల్లం, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఆయిల్.

టమాటా రవ్వ దోశ తయారీ విధానం:

ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి.. ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో అల్లం ముక్కలు, పచ్చి మిర్చి, కారం, ఉప్పు కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఈ ప్యూరీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో రవ్వ, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి జీలకర్ర, కొత్తిమీర, నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. ఆయిల్ వేసి వేడి చేయాలి. అనంతరం రవ్వ దోశను ఎలా వేస్తామో ఇది కూడా అలానే వేసుకోవాలి. ఖాళీలు లేకుండా గరిటతో వేయండి. ఆ తర్వాత ఆయిల్ వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే టమాటా రవ్వ దోశ సిద్ధం. ఈ దోశను నేరుగా కూడా తినవచ్చు.