తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు గతంలో పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, కొన్ని ప్రైవేటు కాలేజీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండడంతో ఆయా కళాశాలలకు పరీక్ష కేంద్రాలు ఇవ్వబోమని బోర్డు స్పష్టం చేసింది.