అమరావతి: ఏపీలో పలువురు ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగింది. 30 మంది ఐపీఎస్‌లకు బదిలీలు (IPS Transfers), పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే..
రైల్వే పోలీస్ అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్
ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్ సింగ్
ఆక్టోపస్ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్ (రోడ్డు సేఫ్టీ అథారిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు)
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి (డ్రగ్స్ డైరెక్టర్ జనరల్‌గానూ అదనపు బాధ్యతలు)
రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా రాజశేఖర్ బాబు (ఐజీ హోంగార్డ్స్‌గానూ అదనపు బాధ్యతలు)
సీఐడీ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజీగా హరికృష్ణ (టెక్నికల్ సర్వీసెస్ ఐజీగానూ అదనపు బాధ్యతలు)
ఆక్టోపస్ డీఐజీగా సెంథిల్ కుమార్ (శాంతిభద్రతల డీఐజీగాను అదనపు బాధ్యతలు)
పోలీసు శిక్షణ డీఐజీగా రాహుల్‌దేవ్ శర్మ
విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని
కర్నూల్ రేంజ్ డీఐజీగా సీహెచ్ విజయరావు
విశాఖ సంయుక్త పోలీస్ కమిషనర్‌గా ఫకీరప్ప
కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీం ఆస్మి
ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్‌గా అమిత్ బర్దార్
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్
ప.గో జిల్లా ఎస్పీగా హజిత్ వేజెండ్ల
రాజమండ్రి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా సుబ్బారెడ్డి
కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా వై.రిశాంత్ రెడ్డి (ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు)
చిత్తూరు ఎస్పీగా జోషువా
ఏసీబీ ఎస్పీగా రవిప్రకాశ్
విశాఖ శాంతిభద్రతల డీసీపీగా సీహెచ్ మణికంఠ
ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్‌గా అధిరాజ్ సింగ్ రాణా
కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా కృష్ణకాంత్ పటేల్
గుంటూరు ఎస్పీగా తుషార్
జగ్గయ్యపేట డీసీపీగా కె.శ్రీనివాసరావు
రంపచోడవరం ఏఎస్పీగా కె.ధీరజ్
పాడేరు ఏఎస్పీగా ఎ.జగదీశ్
విజయవాడ డీసీపీగా ఆనంద్ రెడ్డి
విశాఖ డీసీపీగా సత్యనారాయణ