రోజూ 10,000 అడుగులు మీ లక్ష్యమా? ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్న 5 సులభమైన చిట్కాలు

రోజుకు పదివేల అడుగులు నడవడం అంటే చాలా కష్టం అని చాలామంది అనుకుంటారు. కానీ, అది అసాధ్యం కాదు. మరి ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపతి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అద్భుతమైన చిట్కాలు పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

రోజుకు పదివేల అడుగులు నడవడం అంటే చాలా కష్టం అని చాలామంది అనుకుంటారు. కానీ, అది అసాధ్యం కాదు. నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో, ఆరోగ్యంగా ఉండడం ఒక సవాలుగా మారింది. అయితే, క్రమం తప్పకుండా 10,000 అడుగులు నడిస్తే, డిమెన్షియా (మతిమరుపు), క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాలు తగ్గుతాయని, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ వంటి సంస్థల నివేదికలు చెబుతున్నాయి. మరి ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపతి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అద్భుతమైన చిట్కాలు పంచుకున్నారు. అవేంటో చూద్దాం.


1. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే మొదలుపెట్టండి

“ఒకవేళ మీరు సగటున రోజుకు 4,000 అడుగులు నడుస్తున్నారనుకోండి. రేపటికే 10,000 అడుగులు నడవాలని ప్రయత్నించకండి. మీ శరీరం అంత వేగాన్ని తట్టుకోలేదు, పైగా అంత సమయం కూడా మీకు దొరకదు. అందుకే నెమ్మదిగా మొదలుపెట్టండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే మొదలుపెట్టి, ప్రతి వారం 10 నుంచి 20 శాతం అడుగుల సంఖ్యను పెంచుకోండి. అంటే, 4,000 నుంచి 4,500, తర్వాత 5,000, ఆ తర్వాత 6,000.. ఇలా నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లండి. ఇలా చేస్తే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో సులభంగా 10,000 అడుగుల లక్ష్యాన్ని చేరుకుంటారు” అని ఆయన సూచించారు.

2. చిన్న చిన్న అవకాశాలను గుర్తించండి (Walking Pockets)

ఒకేసారి రెండు గంటల పాటు నడిచి 10,000 అడుగులు పూర్తి చేయడం సాధ్యం కాదు. ఒకవేళ మీరు అలా చేసినా, ప్రతిరోజూ దీన్ని కొనసాగించడం కష్టం. అందుకే, మీ రోజువారీ పనుల్లో నడవడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందో గుర్తించుకోండి. ఉదాహరణకు, భోజనానికి ముందు, భోజనం తర్వాత, ఉదయం ఎక్కువ సమయం, సాయంత్రం కాసేపు.. ఇలా చిన్న చిన్న అవకాశాలను వాడుకోవాలి. ఇలా చేస్తే నిరంతరంగా నడకను కొనసాగించగలరు.

3. ఒకేసారి రెండు పనులు చేయండి (Multitask)

నడుస్తున్నప్పుడు కేవలం నడకపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. నడుస్తూనే ఇతర పనులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు: స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూ నడవడం, మ్యూజిక్ వినడం, పెంపుడు జంతువులతో వాకింగ్‌కు వెళ్లడం లేదా పక్కనే ఉన్న దుకాణానికి నడిచి వెళ్లడం వంటివి చేయొచ్చు. ఇలా నడకను ఇతర కార్యకలాపాలతో కలిపితే మీరు సులభంగా ఈ అలవాటును కొనసాగించగలరు.

4. నియమాలకు కట్టుబడి ఉండొద్దు (Be Unfussy)

వాకింగ్ వెళ్లడానికి ఒక నిర్దిష్ట సమయం, లేదా ఖచ్చితమైన ప్రదేశం ఉండాలని అనుకోకండి. ఎక్కడ వీలైతే అక్కడ, ఎప్పుడు వీలైతే అప్పుడు నడవండి. “వాతావరణం బాగుండాలని లేదా చూసేందుకు మంచి ప్రదేశం కావాలని మీరు అనుకోవద్దు. బయట నడవలేకపోతే ఇంట్లో నడవండి. ఇరుకుగా ఉంటే అక్కడే గుండ్రంగా తిరుగుతూ నడవండి. ఎండ ఎక్కువగా ఉంటే కాసేపు భరించండి. రోడ్డు రద్దీగా ఉంటే కాసేపు మాత్రమే నడవండి. ఎలాగైనా సరే, నడవడానికి ఒక మార్గాన్ని కనుక్కోండి కానీ, ఎక్కువ నియమాలకు కట్టుబడి ఉండకండి” అని ఆయన సలహా ఇచ్చారు.

5. ప్రాధాన్యత ఇవ్వండి, కానీ ఎక్కువగా ఒత్తిడి పడొద్దు

చివరగా, ప్రతిరోజూ కచ్చితంగా నడవాలని ఒత్తిడి పడొద్దని రాజ్ గణపతి అన్నారు. కొన్ని రోజులు మీరు ఎక్కువ నడవవచ్చు, మరికొన్ని రోజులు తక్కువ నడవవచ్చు. కానీ, ఏ రోజు సగటున ఎన్ని అడుగులు నడుస్తున్నారు అనేది ముఖ్యం. నడకను మీ జీవితంలో ఒక సాధారణ భాగంగా మార్చుకుంటే, మీరు ఆటోమేటిక్‌గా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు.

(గమనిక: ఈ కథనం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, మీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.