Curd: రాత్రి పెరుగు తినడం నిజంగానే మంచిది కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే..

www.mannamweb.com


జీర్ణ సంబంధిత సమస్యలు మొదలు, ఎముకల ఆరోగ్యం వరకు అన్నింటికీ పెరుగు ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని లాభాలున్న పెరుగు విషయంలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది రాత్రుళ్లు పెరుగు తీసకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని.? ఇంతకీ నిజంగానే రాత్రి పెరుగు తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్ని రకాల కూరలు ఉన్నా.. చివర్లో ఒక ముద్ద పెరుగుతో తింటే ఆ మజానే వేరు. మనలో దాదాపు ప్రతీ ఒక్కరూ పెరుగును ఎంతో ఇష్టపడి తింటుంటారు. కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా పెరుగుతో ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

జీర్ణ సంబంధిత సమస్యలు మొదలు, ఎముకల ఆరోగ్యం వరకు అన్నింటికీ పెరుగు ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని లాభాలున్న పెరుగు విషయంలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది రాత్రుళ్లు పెరుగు తీసకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని.? ఇంతకీ నిజంగానే రాత్రి పెరుగు తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా.? ఇప్పుడు తెలుసుకుందాం..

* రాత్రిపూట పెరుగు తీసుకుంటే నిద్రకు భంగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే టైరమైన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. దీని కారణంగా మీరు త్వరగా నిద్రపోలేరు. దీంతో ఇది నిద్రలేమి సమస్యకు దారి తీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

* పెరుగు శరీరానికి ప్రొటీన్లను అందించే అద్భుతమైన ఆహారమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పెరుగులో కొవ్వు కూడా ఉంటుంది. సహజంగానే రాత్రి పడుకున్న తర్వాత శారీరకంగా అసలు శ్రమ అనేది ఉండదు. దీంతో ఆ కొవ్వులు శరీంలో నిల్వ అవుతుంటాయి. ఇది బరువు పెరగడానికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.

* రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బర, గ్యాస్‌ వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టోస్ కారణంగా ఈ సమస్య వస్తుంది. దీన్నే లాక్టోస్ ఇంటొలరెన్స్ అంటారు. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ, మన శరీరం లాక్టేజ్ ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, ఇది లాక్టోస్ అసహనానికి దారితీస్తుంది.

* కీళ్ల నొప్పులతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు పెరుగుతినడం వల్ల కీళ్లలో దృఢత్వం తగ్గుతుంది, నొప్పులు పెరిగే అవకాశం ఉంటుంది.

మరి ఎప్పుడు తినాలి.?
పెరుగును రాత్రి కంటే ఉదయం తీసుకోవడం బెటర్‌. మధ్యాహ్నం లంచ్‌ సమయంలో పెరుగును తీసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం పెరుగుతో తింటే నిద్ర వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఉదయం తీసుకుంటే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందుకే మన పెద్దలు చద్దన్నంను మనకు అలవాటు చేశారు. ఉదయం చద్దనం తినడం వల్ల కడుపు హాయిగా ఉంటుంది.