ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు ఉదయం నిద్ర లేవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ రొటీన్ గా జరిగే పనులనే చేయడం చాలా మంది యువతకు ఎంతో బోరింగ్ గా ఉంది.
కాగా నిర్దిష్ట దినచర్యలను అనుసరించడం మూలంగా రోజును ఎంతో విశ్వాసంతో, క్రమశిక్షణ, సానుకూల దృక్పథంతో ప్రారంభించడం వల్ల ఆ రోజంతా ఎంతో హుషారుగా ఉంటారు.
కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే అనారోగ్యకరమైన ఉదయం పూట కొన్ని అలవాట్లను మన జీవితంలో మనం చేర్చుకుని ఉంటాం. ఆ అలవాట్లు మన రోజును ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చాలామంది స్లిప్ ఎక్స్పర్ట్స్ మీరు స్నూచ్ బటన్ నొక్కడం మానుకోవాలని చెబుతున్నారు. మ్యూట్ బటన్ నొక్కినట్లయితే మీరు దాదాపుగా పూర్తి చేయలేని నిద్ర చక్రం ప్రారంభించినట్లు ఒక అధ్యయనంలో తేలింది.
ఒకవేళ ఆ చక్రాన్ని పూర్తి చేయలేకపోతే మీరు రీఛార్జ్ కాకుండా అలసిపోయి నిద్ర లేవల్సి ఉంటుంది. ఉదయాన్నే మీరు బెడ్ ను సెట్ చేయడం వల్ల ఆ రోజంతా ఎంతో సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అలా చేయడం మిమ్మల్ని సోమరితనం, నిరాశకు గురి చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు వల్ల ఆందోళన చెందే అవకాశం ఉంది. అలాగే మీ శరీరం సహజ ఒత్తిడి హార్మోన్ పర్యవరీక్షణ వ్యవస్థను గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది.
చాలామంది ప్రజలలో నిపుణులు ఆరోగ్యకరమైన దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవడం ఎంతో ప్రయోజనకరం అని చెబుతున్నారు. ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాలి. ఎందుకంటే పూర్తి ఆరోగ్యము శ్రేయస్సు కోసం వ్యాయామం ఎంత ముఖ్యమో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కానీ అందరూ దీన్ని అనుసరించలేరు. మంచి రాత్రి నిద్ర తర్వాత మేల్కొన్న వారు దాదాపు 7 నుండి 8 గంటలు నీరు లేకుండా గడుపుతారు. కాబట్టి మీ శరీరం డిహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే నిద్రలేచిన వెంటనే శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల కళ్ళు తిరగడం, బలహీనంగా అనిపించడం లాంటివి జరగవు.