Jaggery with Chana Benefits: బెల్లం, శనగలు కలిపి తినండి చాలు.. ఆ సమస్యలన్నీ దూరం..

జీవక్రియను పెరుగుతుంది: ప్రతిరోజూ ఉదయం శనగలు, బెల్లం కలిపి తింటే కండరాలు దృఢంగా మారుతాయి. వ్యాయాయం చేసే వారు, జిమ్ కు వెళ్లేవారు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.


ఎందుకంటే బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గుతారు: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు అధికబరువు , ఊబకాయం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి శనగలు, బెల్లం దివ్యౌషధం లాంటివి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. ప్రతిరోజూ 100గ్రాముల శనగలను ఆహారంలో తీసుకుంటే శరీరానికి 19 గ్రాముల ప్రొటీన్ అందుతుంది.

ఎసిడిటిని దూరం చేస్తుంది: ప్రస్తుత కాలంలో చాలామంది ఎసిడిటి సమస్యతో భాదపడుతున్నారు. ఎసిడిటి సమస్యను తగ్గించాలంటే బెల్లం, శనగలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి మీ జీర్ణశక్తిని బలంగా ఉంచుతాయి. శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సూపర్ ఫుడ్ డైజెస్టివ్ ఎంజైమ్‎లను యాక్టివేట్ చేస్తాయి.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది: వీటిని డైట్ లో చేర్చుకుంటే జ్ఞాపకశక్తికి పెరుగుతుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ను మెరుగుపరుస్తుంది. దీంతో మీ మెదడు పనితీరు బాగా పెరుగుతుంది. అంతేకాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది.

దృఢమైన దంతాల కోసం: శనగలు , బెల్లం కలిపి తింటే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. వీటిలో ఉండే భాస్వరం దంతాలను బలపరుస్తుంది. 10 గ్రాముల బెల్లం 4 మిల్లీగ్రాముల భాస్వరం, 100గ్రాములకు 168 మిల్లీగ్రాముల లభిస్తుంది.

గుండె జబ్బులను నయం చేస్తాయి: గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో శనగలు, బెల్లం ఎంతగానో సహాయపడతాయి. అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడతాయి. శనగల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

రక్తహీనత దూరమవుతుంది: రక్తం రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే శెనగలు, బెల్లం కలిపి తినవచ్చు. ఈ రెండూ ఐరన్‌ పుష్కలంగా ఉన్న కారణంగా రక్తంలో ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలను పెంచి శరీరంలో రక్తహీనతను దూరం చేస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.