అధిక పెన్షన్ ఆశావహులకు ఝలక్.. EPFO కొత్త రూల్స్.. పింఛన్ భారీగా తగ్గిపోనుందా?

www.mannamweb.com


EPFO: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS-95) కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, పెన్షనర్లకు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. అధిక పెన్షన్ లెక్కింపునకు ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కొత్త రూల్ తీసుకొచ్చినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ప్రో రాటా (Pro Rata) ఆధారంగా అధిక పెన్షన్ లెక్కింపు చేపట్టనుందని తెలుస్తోంది. ఈ కొత్త రూల్ అమలు చేస్తే అధిక పెన్షన్ ఆశావహులకు భారీగా నష్టం వాటిళ్ల నుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈపీఎస్-95 సభ్యులకు దాదాపు 30 శాతం నుంచి 40 శాతం మేర అధిక పెన్షన్ తగ్గిపోనుందని తెలుస్తోంది.

ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు అమలులోకి తెస్తున్నట్లు కార్మిక విభాగం నిపుణులు వెల్లడించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈపీఎఫ్ఓ ఆఫీసుల సమాచారం ప్రకారం.. అధిక పెన్షన్ లెక్కింపు అనేది రెండు భాగాలుగా విభజించనున్నారని నిపుణులు తెలిపారు. అయితే, ఈ విషయంపై ఈపీఎఫ్ఓ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన గానీ లేగా సర్క్యూలర్ గానీ జారీ కాలేదు. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ విడుదల చేసిన సర్క్యూలర్లలోనూ ప్రో రాటా ఆధారంగా పెన్షన్ లెక్కిస్తామని ఎక్కడా చెప్పలేదు.
పెన్షన్ లెక్కింపునకు తీసుకొచ్చే కొత్త రూల్ అనేది ఇప్పటికీ పని చేస్తున్న ఉద్యోగులు, లేదా సెప్టెంబర్ 1, 2024 తర్వాత రిటైర్ అయిన వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి సగటు పెన్షన్ శాలరీ లెక్కింపునకు సర్వీస్ పీరియడ్ అనేది రెండు భాగాలుగా లెక్కించనున్నారని తెలిపారు. మొదటి భాగంలో.. ఈపీఎస్-95 డేటా అమలులోకి వచ్చిన 16-11-1995 తేదీ నుంచి ఆగస్టు 31, 2014 వరకు.. రెండో భాగం సెప్టెంబర్ 1, 2014 నుంచి రిటైర్మెంట్ తేదీ వరకు సగటు వేతనం లెక్కలోకి తీసుకుంటారు. తొలి భాగంలో చివరి 60 నెలల జీతాన్ని లెక్కలోకి తీసుకుంటారు. అలాగే రెండో భాగంలో సెప్టెంబర్ 1, 2024 తర్వాత 60 నెలల శాలరీని లేదా రిటైర్మెంట్ వరకు ఉన్న శాలరీని తీసుకుంటారు.
ప్రో రాటా ఆధారంగా కొత్త కాలిక్యులేషన్ రూల్ అనేది పెన్షన్ అమౌంట్ ని గణనీయంగా తగ్గిస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 2014కి ముందు వేతన లిమిట్ అనేది చాలా తక్కువగా ఉంది. దీంతో చాలా మందికి మొదటి భాగంలో లెక్కించే సగటు పెన్షన్ శాలరీ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మొత్తంగా చేతికి అందే పెన్షన్ భారీగా తగ్గిపోతుంది. 30-40 శాతం మేర కోత పడే సూచనలు ఉన్నాయని కార్మిక విభాగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉంటుందని సూచిస్తున్నారు.