నిరుద్యోగ సమస్యతో యువతీ యువకులు ఇబ్బంది పడుతున్నారు. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగం దొరకడం కష్టం. బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి యూనియన్ బ్యాంక్ శుభవార్త చెప్పింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్‌షిప్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, మొత్తం 2691 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత కలిగిన, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 5 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
రాష్ట్రాల వారీగా అప్రెంటిస్ ఖాళీలు: 2691
ఒడిశా- 53
కేరళ- 118
తమిళనాడు- 122
మహారాష్ట్ర- 296
తెలంగాణ- 304
కర్ణాటక- 305
ఆంధ్రప్రదేశ్- 549
అవసరమైన అర్హతలు:
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: ఫిబ్రవరి 1, 2025 నాటికి 20 మరియు 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఇవ్వబడుతుంది.
స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,000 ఇవ్వబడుతుంది.
దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
ఎంపిక ప్రక్రియ: ఈ ఖాళీలను రాత పరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 5, 2025