Vastu Tips | కొత్తగా ఇల్లు( House ) నిర్మించుకునే ప్రతి ఒక్కరూ జ్యోతిష్య, వాస్తు శాస్త్రం( Vastu Tips ) ప్రకారం నిర్మించుకుంటారు. ఎందుకంటే ఆ ఇంట్లో కొన్నేండ్ల పాటు నివాసం ఉండాలి కాబట్టి.
మనం చేసే ప్రతి పని సంపూర్ణంగా విజయవంతం కావాలంటే.. ఇల్లు వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాల్సిందే. కానీ కొందరు పొరపాటు చేస్తుంటారు. అదేంటంటే.. ఏయే దిక్కుల్లో ఏయే వస్తువులు, మొక్కలు పెట్టకుండా ఇష్టారీతిన పెడుతుంటారు. అలాంటి వారు కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు. ఇలా ఆర్థిక కష్టాలు ఉన్న వారు.. ఈశాన్య( North East) దిక్కుపై దృష్టి సారించాలి. ఈ దిక్కులో కొన్ని వస్తువులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి( Lakshmi Devi ) సంపూర్ణ అనుగ్రహం పొంది అఖండ ధనలాభం సొంతం చేసుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఈశాన్యంలో ఉంచాల్సినవి, ఉంచకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏ ఇంట్లోనైనా ఈశాన్య దిక్కులో లక్ష్మీ గణపతి( Lakshmi Ganapathi ) ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. రోజూ ఆ దేవుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి, మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అదృష్టం త్వరగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.
చాలా మంది నివాసాల్లో ఇంటి ముంగిట తులసి మొక్క( Tulasi Plant ) ఉంటుంది. ఆ మొక్కను వాస్తు నియమాలకు విరుద్ధంగా ఎక్కడి పడితే అక్కడ ఉంచుతారు. ఇది తప్పని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఇంటికి ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా, ఆవు దూడ ఉన్న చిత్రపటం, కామధేనువు చిత్రపటం, పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్న ఫొటో వీటిలో దేన్ని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నా అదృష్టం త్వరగా కలిసొచ్చి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంటున్నారు.
ఒకవేళ ఏ ఫొటో లేకపోయినా ఈశాన్య మూలలో డైలీ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి, మూడు వత్తులు వేసి దీపారాధాన చేసినా ఆర్థికంగా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు. అయితే, ఈ దిక్కులో దీపం పెట్టేటప్పుడు “ఓం హం ఈశాన్యాయ నమః” అనే మంత్రాన్ని మనసులో 11 సార్లు చదువుకొని నమస్కారం చేసుకోవాలి.
ఒక చిన్న గిన్నెలో కొద్దిగా రాళ్ల ఉప్పు తీసుకొని దాన్ని ఈశాన్యంలో ఉంచినా మంచి ఫలితాలు సొంతం చేసుకోవచ్చంటున్నారు. అయితే, ఈ ఉప్పును డైలీ మార్చాలి. మార్చిన పాత ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి.
పైవేవి చేయలేని వారు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా బియ్యం పోసి దాన్ని ఈశాన్య దిక్కులో ఉంచినా శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య, వాస్తు పండితులు చెబుతున్నారు