కర్ణాటక స్టైల్ వెజిటేబుల్ పులావ్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్

www.mannamweb.com


పులావ్స్‌లో ఎన్నో రకాలు ఉంటాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో చేసే స్టైల్ వంటలే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో చేసే వంటలు కూడా చాలా ఫేమస్. వాటిల్లో కర్ణాటక స్టైల్ వెజిటేబుల్ పులావ్.

ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే తక్కువ సమయంలో పూర్తి అవుతుంది. ఇందులో ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో కూరగాయలు ఉపయోగిస్తారు. లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా త్వరగా ఈ వంట చేసుకోవచ్చు. మరి ఈ కర్ణాటక స్టైల్ వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటక స్టైల్ వెజిటేబుల్ పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:

బియ్యం, ఉప్పు, నెయ్యి, పులావ్ దినుసులు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర, బంగాళ దుంప, బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ. ఇలా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఉపయోగించవచ్చు.

కర్ణాటక స్టైల్ వెజిటేబుల్ పులావ్‌ తయారీ విధానం:

ముందుగా మిక్సీ జార్‌లోకి కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చి కొబ్బరి లేక పోతే ఎండు కొబ్బరిని నీటిలో నానబెట్టి వేసుకోవచ్చు. అనంతరం పులావ్ తయారు చేసేందుకు సరిపడా ఉండే పాత్ర తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. ఇందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పులావ్ దినుసుకు వేసి వేయించాలి. సువాసన వస్తుండగా పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసి ఫ్రై చేసి ఉల్లిపాయ, పచ్చి మిర్చి కూడా వేయాలి. ఇవి కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ ఫ్రై చేయాలి.

ఇది కూడా వేగాక.. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత నానబెట్టిన బియ్యం, సరిపడా నీటిని వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మధ్యలో చూసుకుంటూ ఉండాలి. పులావ్ అయిపోయాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.