ఏపీ(Andhra Pradesh)లోని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం(AP Government) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల(జూలై) 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగే ఈ బహిరంగ సమావేశంలో విద్య, మౌలిక సదుపాయాలను కార్యాచరణ ప్రణాళికలను వివరిస్తారు. అలాగే, పిల్లల మానసిక ఆరోగ్యం, పురోగతిపై సెషన్లు, ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు సూచించారు.