ప్రస్తుత కాలంలో ఆర్థిక అవసరాలు చాలా వరకు పెరిగాయి. వ్యక్తిగత లోన్స్, గృహ, వాహన రుణాలను తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.
దీంతో పలువురు బ్యాంకులు, వివిధ ఫైనాన్స్ కంపెనీలను సంప్రదిస్తున్నారు. ఇవి CIBIL( క్రెడిట్ స్కోర్) స్కోర్ ఆధారంగా లోన్స్‌ను అందిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా లోన్స్ పొందడానికి వినియోగదారులకు అవకాశం ఉంటుంది. అదే స్కోర్ తక్కువగా ఉంటే గనుక లోన్ పొందడం కష్టంగా ఉంటుంది. CIBIL స్కోర్ అనేది వినియోగదారులు తీసుకున్న లోన్స్‌లను సకాలంలో చెల్లించడం ద్వారా పెరుగుతుంది. సమయానికి చెల్లింపులు చేయనట్లయితే CIBIL స్కోర్ తగ్గుతుంది. దీంతో సంస్థలు లోన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, వినియోగదారుల ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించి అన్ని సంస్థలకు అందిస్తుంది. దీని ఆధారంగా సంస్థలు అర్హత ఉన్న వడ్డీ రేటు ప్రకారం రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. మరి ఇంత ముఖ్యమైన CIBIL స్కోర్‌ను సులభంగా తెలుసుకోడానికి కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
WhatsApp ద్వారా CIBIL స్కోర్‌ను తెలుసుకునే ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. WhatsAppలో క్రెడిట్ స్కోర్‌ని తెలుసుకోడానికి 9920035444 నంబర్‌ను సేవ్ చేసుకుని “హే” అని మెసేజ్ చేయాలి. తరువాత చాట్‌లో వచ్చిన విధంగా పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామాను సెండ్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయ్యాక క్రెడిట్ స్కోర్ వాట్సాప్‌లో చూపిస్తుంది. కాపీ కూడా ఈ-మెయిల్ ద్వారా వస్తుంది.