Orange Cap: ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్‌కు ఆరెంజ్ క్యాప్ దక్కుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ రేసులో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 11 మ్యాచుల్లో 542 పరుగులు చేశాడు.
రెండో స్థానంలో సీఎస్కే బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. అతడు 10 మ్యాచుల్లో 509 పరుగులు బాదాడు. మూడో స్థానంలో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఉన్నాడు. 11 మ్యాచుల్లో అతడు 424 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవాలంటే ఆయా బ్యాటర్ల జట్లు ప్లే ఆఫ్‌లోకి ప్రవేశిస్తేనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
అత్యధిక పరుగులు బాదిన టాప్-10 ప్లేయర్స్
ఆటగాడు | మ్యాచులు | ఇన్నింగ్స్ | పరుగులు | |||||
---|---|---|---|---|---|---|---|---|
1 | విరాట్ కోహ్లీ | 11 | 11 | 542 | ||||
2 | రుతురాజ్ | 10 | 10 | 509 | ||||
3 | సాయి సుదర్శన్ | 11 | 11 | 424 | ||||
4 | రియాన్ పరాగ్ | 10 | 9 | 409 | ||||
5 | కేఎల్ రాహుల్ | 11 | 10 | 406 | ||||
6 | ఫిలిప్ సాల్ట్ | 11 | 11 | 406 | ||||
7 | రిషబ్ పంత్ | 11 | 11 | 398 | ||||
8 | ట్రావిస్ హెడ్ | 9 | 9 | 396 | ||||
9 | సంజూ శాంసన్ | 10 | 10 | 385 | ||||
10 | సునీల్ నరైన్ | 11 | 10 | 380 |