Kuldhara village Rajasthan story – రాజస్థాన్ లోని అతి భయంకరమైన గ్రామం – కుల్ ధారా …. 200 సంవత్సరాలుగా ఆ ఊరు ఖాళీగానే ఉంది …. ఏం జరిగింది..

www.mannamweb.com


Kuldhara village Rajasthan story – రాజస్థాన్ లోని అతి భయంకరమైన గ్రామం – కుల్ ధారా …. 200 సంవత్సరాలుగా ఆ ఊరు ఖాళీగానే ఉంది …. ఏం జరిగింది..
రాజస్థాన్ రాష్ట్రంలో, జైసల్మేర్‌కి పది హేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్‌ధారా. ఒకప్పుడు నిండా జనంతో, అందమైన గృహాలతో కళక ళలాడేది. పండుగలు పబ్బాలతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇళ్లు లేవు. అంతుపట్టని నీడలు, వికృతమైన అరుపులు, ఎవరివో తెలియని అడుగుల జాడలు తప్ప మనుషుల ఉనికి లేదు. ఎందుకని? అసలా ఊరికి ఏమయ్యింది?

మూడు వందల యేళ్ల క్రితం కుల్ ధారాలో పలివాల్ బ్రాహ్మణ కులస్థులు మాత్రమే ఉండేవారు. అందరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. కానీ రాత్రికి రాత్రే ఊరిలోని జనమంతా మాయమై పోయారు. దానికి కారణం… ఒకరోజు ఆ గ్రామానికి దురదృష్టం నడచుకుంటూ వచ్చింది… ప్రధాని సలీమ్ సింగ్ రూపంలో (అప్పట్లో గ్రామ ప్రధానులని ఉండేవారు. వారిదే ఆధిపత్యం)
కుల్‌ధారా గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను సలీమ్ ఇష్టపడ్డాడు. కానీ ఆమె అతణ్ని ఇష్టపడలేదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీమ్. అది తట్టుకోలేక ఊరివాళ్లు తిరగ బడ్డారు. తమ కులం కానివాడికి అమ్మా యిని ఇవ్వలేమని, దూరంగా ఉండమని హెచ్చరించారు. రగిలిపోయాడు సలీమ్. ఊరివాళ్ల మీద పగబట్టాడు. అధిక పన్నులు విధించి హింసించాడు. అయినా ఎవరూ లొంగకపోవడంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు


అతనికి ఎదురు తిరిగి పోరాడటం మాటలు కాదు. అందుకే అందరూ కలిసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లేముందు… ఆ ఊరు ఇక నివాసయోగం కాని విధంగా నాశనమైపోతుందని శపించారట. అందుకే కుల్‌ధారా అలా అయిపోయిందని అంటూ ఉంటారు.
అయితే ఈ కథలో కొంతే నిజం ఉందని, గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోలేదని, రాత్రికి రాత్రే సలీమ్ సింగ్ అందరినీ చంపి పాతి పెట్టేశాడని, వాళ్లంతా దెయ్యాలై ఊరిని పట్టి పీడిం చడం మొదలు పెట్టారనీ మరో వాదన.
ఏది నిజమో తెలుసుకోవాలని, రాత్రికి రాత్రే జనమంతా ఏమైపోయారో కని పెట్టాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఎవరి జాడా తెలియక మిన్నకుండిపోయారు. తర్వాత కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో నివసించడానికి వచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. అర్ధరాత్రిళ్లు ఎవరో తలుపులు బాధేవారు. తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఎవరో గట్టిగట్టిగా అరిచేవారు. ఏడ్చేవారు, నవ్వేవారు. ఏవేవో నీడలు వెంట తిరుగుతూండేవి.

ఏవేవో రూపాలు కనిపించి భయపెట్టేవి. దాంతో అందరూ ఊరు వదిలి పారి పోయారు. క్రమంగా ఈ గ్రామంలో జరుగుతున్నవన్నీ బయటకు తెలియ డంతో ఎవ్వరూ అక్కడకు వెళ్లే సాహసం చేయలేపోయారు. ఒక్కోసారి ఆ ఊరి పక్క నుంచి వెళ్లేవాళ్ల వాహనాలు హఠాత్తుగా ఆగిపోయేవి. తర్వాత వారికి అక్కడ భయానక అనుభవాలు ఎదురయ్యేవి. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారంతా కలిసి కుల్‌ధారా ఒక ఘోస్ట్ విలేజ్ అని తేల్చి చెప్పేశారు. ఆ ముద్ర నేటికీ అలానే ఉంది. దాన్ని చెరిపే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. ఎందుకంటే… తమ ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం గానీ… అక్కడికి వెళ్లి తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకునే ధైర్యం గానీ ఎవరికీ లేవు కాబట్టి!
కుల్‌ధారా ముఖద్వారం

ఢిల్లీలోని పారాపార్మల్ సొసైటీకి చెందిన పన్నెండు మంది సభ్యులు కుల్‌ధారా గ్రామానికి వెళ్లారు. వాళ్లు అక్కడ ఉన్న ఆ రాత్రి వారికి కాళరాత్రి అయ్యింది. ఏవేవో నీడలు కనిపించాయి. ఏవేవో స్వరాలు వినిపించి భయపెట్టాయి. వారి వాహనాల మీద చిన్నపిల్లల చేతి ముద్రలు ప్రత్యక్షమయ్యాయి. ఉన్నట్టుండి టెంపరేచర్ పడిపోయేది. ఉన్నట్టుండి పెరిగిపోయేది. దాంతో వాళ్లు కూడా కుల్‌ధారా గురించి అంతవరకూ ఉన్నవన్నీ వదంతులు కావని, వాస్తవాలేనని నమ్మే పరిస్థితి వచ్చింది. నాటి నుంచీ కుల్‌ధారా అంటే అందరికీ మరీ భయం పట్టుకుంది. ప్రభుత్వం కుల్‌ధారాని సందర్శనా స్థలంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. సందర్శకులు కూడా బాగానే వస్తున్నారు. కానీ చీకటి పడే సరికల్లా పరారైపోతురు.
రాత్రిళ్లు అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని . బావి లోనుంచి కేకలు వినిపిస్తూ ఉంటాయని ఆ గ్రామం వైపు తిరిగే గొర్రెల కాపరులు చెబుతున్నారు.

(భారతీయ ఆర్కియాలజీ శాఖ వాళ్ళు అక్కడ ప్రమాదకరమైన స్థలం అని బోర్డు కూడా పెట్టారు. ఆ స్థలం ఇప్పుడు పురాతన స్థలంగా పరిగణించి ఉంచారు)

Kuldhra, The haunted village of Rajasthan, India

 

Haunted Village Kuldhara | Drone View | Free stock footage