అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పు మధ్యవర్తిత్వం వల్ల రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. సుదీర్ఘకాలంగా ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రంగం దెబ్బతింటుంది.
ముఖ్యంగా యూరప్ అలాగే రష్యా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాగే కుక్రై నుంచి ఎగుమతులు కూడా దెబ్బతినడంతో ప్రపంచ వాణిజ్యానికి సప్లై చెయిన్ దెబ్బ తిన్నది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో గడచిన కొంతకాలంగా నష్టాల బారిన పడుతున్నాయి దీంతో ఇన్వెస్టర్లు తమ సురక్షితమైన పెట్టుబడులకు ఘనంగా భావించే బంగారం వైపు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు ఫలితంగా బంగారం ధర కూడా ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకింది ఒక ఔన్సు బంగారం ధర 3000 డాలర్లు దాటింది. అయితే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లీ స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టే అవకాశం ఉంటుంది ఫలితంగా బంగారం డిమాండ్ తగ్గుతుంది.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపు – బంగారంపై ప్రభావం:
>> యుద్ధం అనంతరం ఇన్వెస్టర్లు ఇకపై రిస్క్ – ఆఫ్ సెగ్మెంట్స్ గా భావించే బంగారంలో పెట్టుబడి తగ్గించే అవకాశం ఉంటుంది. సాధారణంగా సంక్షోభ సమయాల్లో పెట్టుబడిదారులు సురక్షితంగా భావించే బంగారంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంటారు.
>> యుద్ధం ముగిసిన తర్వాత ఈ డిమాండ్ భారీ ఎత్తున తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ధరల తగ్గుదల వల్ల డిమాండ్ తగ్గి బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది ఫలితంగా బంగారు ఆభరణాలు సైతం మార్కెట్లో తగ్గే వీలుంది.
>> దీంతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచింది ఇది కూడా బంగారం ధర తగ్గడానికి ఒక రకంగా కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా పెడదాం లేజర్ వడ్డీరేట్లు స్థిరంగా ఉంచినప్పుడు లేదా పెంచినప్పుడు బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది.
>> డాలర్ బలోపేతం అవడం కూడా బంగారం ధర తగ్గడానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తోడు బంగారం ధర డాలర్ బలోపేతం అయినప్పుడల్లా తగ్గడం చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాం.
>> .స్టాక్ మార్కెట్లు రికవరీ అవ్వడం కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు నుంచి స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తుంటారు. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్ వంటి స్కీముల నుంచి లాభాలను బుక్ చేస్తూ ఉంటారు.
బంగారం ధర ఎంత వరకు తగ్గవచ్చు ?
బంగారం డిమాండ్ తగ్గినట్లయితే 2800 డాలర్లకు ఒక ఔన్సు వరకూ ధర తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన భారతదేశంలో కూడా దాదాపు పది నుంచి 15 వేల రూపాయల వరకు బంగారం ధర తగ్గే అవకాశం ఉంది.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. పాఠకులకు డబ్బు, పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.