మహిళలకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకం ఒకటి తీసుకొచ్చింది. ప్రత్యేకించి మహిళల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రారంభించారు.
అదే.. ఎల్ఐసీ బీమా సఖి యోజన (LIC Bima Sakhi Yojana) పథకం. ఈ పథకం కింద అప్లయ్ చేసుకునే మహిళలను ‘బీమా సఖి’గా పిలుస్తారు.
ఇందులో మహిళలు ‘కెరీర్ ఏజెంట్’లుగా పనిచేస్తారు. తద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ బీమా సఖి పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అనేది ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ.
అద్భుతమైన బీమా పాలసీలను అందించడంలో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ.. మహిళల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద, అర్హత కలిగిన మహిళలకు నెలకు కనీసం రూ. 7,000 అందిస్తోంది. బీమా సఖి యోజన కింద పనిచేసే మహిళలు కేవలం ఏజెంట్ మాత్రమేనని గమనించాలి.
ఎల్ఐసీ బీమా సఖి పథకం ఏంటి? :
గత సంవత్సరం డిసెంబర్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా స్టైపెండియరీ స్కీమ్ ఎల్ఐసీ బీమా సఖి (MCA Scheme) పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహిళలను ఆర్థికంగా సాధికారపరచేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ పథకంలో చేరిన మహిళలు ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేస్తారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు తగిన శిక్షణ పొందుతారు. బీమా సఖి పథకం అనేది భారత్‌లోని వెనుకబడిన ప్రాంతాలలో బీమా సౌకర్యాన్ని అందిస్తుందని ఎల్ఐసీ భావిస్తోంది.
ఎల్ఐసీ బీమా సఖి అర్హతలివే :
ఈ పథకానికి అర్హత పొందాలంటే.. మహిళ 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. 18ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బీమా సఖీలు ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేసే అవకాశాన్ని పొందుతారు.
కంపెనీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుత ఏజెంట్ MCA నియామకానికి అప్లయ్ చేసుకోలేరని గమనించాలి. అలాగే, ప్రస్తుత ఏజెంట్లు లేదా ఉద్యోగుల బంధువులు ఎంసీఏలుగా నియామకానికి అర్హులు కారు.
ఎల్ఐసీ బీమా సఖి స్టైపెండ్ :
ఈ పథకంలో భాగంగా, పాలసీ అమ్మడం ద్వారా వచ్చే కమీషన్‌తో పాటు మొదటి 3 ఏళ్లకు ఎల్ఐసీ ఫిక్స్‌డ్ స్టైఫండ్‌ను అందిస్తుంది. మహిళలకు నెలవారీ ఆదాయం రూ.7వేల నుంచి వస్తుంది. మొదటి సంవత్సరంలో ప్రతి నెలా రూ.7వేలు అందుకుంటారు. రెండో సంవత్సరంలో నెలవారీ చెల్లింపు రూ.6వేలు అవుతుంది.
మూడవ సంవత్సరం నాటికి, ఈ మొత్తం రూ.5,000కి తగ్గుతుంది. అయితే, రెండవ సంవత్సరంలో స్టైపెండ్‌కు అర్హత పొందాలంటే.. ఒక వ్యక్తి మొదటి స్టైపెండ్యరీ సంవత్సరంలో కనీసం 65 శాతం పాలసీలను పూర్తి చేయాలి. అదేవిధంగా, బీమా సఖి రెండవ స్టైపెండ్యరీ సంవత్సరంలో కనీసం 65 శాతం పాలసీలను పూర్తి చేయాలి.
‘బీమా సఖి’కి ఎలా అప్లయ్ చేయాలి? :
బీమా సఖి యోజన కింద మహిళలు అధికారిక వెబ్‌సైట్ (https://agencycareer.licindia.in/agt_req/index1.php)ను విజిట్ చేయాలి.
బీమా సఖి ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ వ్యక్తిగత వివరాలను రిజిస్టర్ చేయాలి.
మీరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఆపై (Submit) బటన్ క్లిక్ చేయాలి.
బీమా సఖి యోజనకు అప్లయ్ చేసేవాళ్లు ఈ లింక్ (LIC Bima Sakhi Yojana )పై క్లిక్ చేయండి.